OTT Movie: 1 గంట 45 నిమిషాల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ చూడొచ్చు

ఎలాంటి లవ్ ట్రాక్‌లు, అనవసర పాటలు లేని పక్కా గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ సినిమా మీకు బెస్ట్ ఆప్షన్. ఐఎమ్ డీబీలో 8.2 రేటింగ్ తో ఉన్న ఈ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: 1 గంట 45 నిమిషాల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Sep 14, 2026 | 9:07 PM

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమా? ఓటీటీలో దృశ్యం లాంటి  మంచి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. రెండు గంటల కంటే తక్కువగా నిడివి ఉండడం ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకున్న మరో స్పెషాలిటీ. అలాగే ఈ చిత్రం అనేక అవార్డులను కూడా గెలుచుకుంది, తమిళంతో పాటు తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. అది కూడా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్ డీబీలోనూ ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు 10కి 8.2 రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ప్రమాదం కారణంగా కాలేజీ రోజుల నాటి ఒక హత్య కేసును దర్యాప్తు చేస్తూ కాలు కోల్పోయిన రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్, తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన కేసును ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథ.. స్టోరీ మొత్తం రిటైర్డ్ పోలీస్ అధికారి దీపక్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రమాదంలో దీపక్ తన కాళ్లను కోల్పోతాడు. అయితే కెరీర్ లో తన చివరిగా, అసంపూర్తిగా ఉన్న ఓ కేసు గురించి విచారణ మొదలు పెడతాడు. ఇదే క్రమంలో ఒకే రాత్రి మూడు వేర్వేరు సంఘటనలు (ప్రమాదం, ఆత్మహత్య, హత్య) జరుగుతాయి. మరి ఈ సంఘటనలు, దీపక్ విచారిస్తోన్న కేసుకు సంబంధమేంటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే. చివరి వరకు థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు ఊహించలేని షాక్ ఇస్తుంది.

దృశ్యం’ వంటి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏ మాత్రం తగ్గని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘ధ్రువంగళ్ పతినారు’ (డి-16). ‘ధ్రువంగల్ పతినారు’ అంటే ’16 కోణాలు’ అని అర్థం. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పైగా ఈ సినిమాలో ఎలాంటి పాటలు, లవ్ ట్రాకులు ఉండవు. అలాగే అనవసరమైన సన్నివేశాలేవీ కూడా ఉండవు. కేవలం గంటా 45 నిమిషాల నిడివితో ఎంతో గ్రిప్పింగ్ సాగే ఈ సినిమాకు IMDBలో 10కి 8.2 రేటింగ్ లభించింది. ప్రస్తుతం ‘ధ్రువంగళ్ పతినారు’ (డి-16) సినిమా ఓరిజినల్ వెర్షన్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ మాత్రం ఆహా ఓటీటీతో పాటు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us