
ఇటీవల ఓటీటీలోకి వచ్చిన సర్వం మాయ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో కేవలం మలయాళం వెర్షన్ రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ తో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి మరో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ మలయాళం మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అక్కడి ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు కడుపుబ్బా నవ్వించింది. సస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కామెడీ కూడా ఉండడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక గ్రామంలోకి అకస్మాత్తుగా ఒక వింత జీవి సంచరించడం మొదలవుతుంది. దానిని చూసిన వారందరూ వణికిపోతుంటారు. ఎందుకంటే ఆ జీవికి మనిషి శరీరం, గుర్రపు కాళ్లు ఉంటాయి. ఊరంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించేలా చేసిన ఆ వింత జీవి గురించి హీరో (శ్యామ్) అనే యువకుడు ప్రయత్నిస్తాడు. మరి ఈ వింత జీవి ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్ గా సాగుతూ కడుపుబ్బా నవ్వించే ఈ మూవీ పేరు నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’ (Nellikkampoyil Night Riders). ‘లియో’ మూవీ ఫేమ్ మాథ్యూ థామస్ ప్రధాన పాత్రలో నటించాడు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 06) జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట. ఓటీటీప్లే ఓటీటీలోనూ ప్రీమియం ద్వారా కూడా ఈ సూపర్ హిట్ మూవీని చూడొచ్చు. అయితే ఈ మూవ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఉంటుందా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ మాత్రం అందుబాటులో ఉండనున్నాయి.
ప్రస్తుతం మలయాళం సినిమాలన్నీ తెలుగు వెర్షన్ లో కూడా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కాబట్టి ఈ మూవీ కూడా తెలుగులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.