Telugu News Entertainment Ott List Of New Movies And Web Series To Stream On Various OTT Platforms In September Last Week
OTT Movies: దసరా హాలీడేస్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
దసరా సెలవులు ప్రారంభమయ్యాయి.. కాబట్టి ఈ సెలవుల్లో చాలా మంది సినిమాలు చూడడానికి బాగా ప్రాధాన్యమిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఈ వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సుమారు 25 కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి.
పవన్ కల్యాణ్ అభిమానులకు ముందే దసరా రానుంది. ఎందుకో ప్రత్యేకంగా చెప్పక్కర్లదనుకుంటా. పవర్ స్టార్ నటించిన ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరాకు తెలుగులో విడుదలయ్యే సినిమా ఇదొక్కటే. అలాగే హిందీలో ఆస్కార్ నామినేటెడ్ మూవీ హౌమ్ బౌండ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఓటీటీల్లోనూ మూవీ లవర్స్ కు మస్త్ ఎంటర్ టైన్మెంట్ దొరకనుంది. పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి సెప్టెంబర్ 2 వారంలో వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రానున్న సినిమాలు, సిరీస్ లపై ఒక లుక్కేద్దాం రండి.