OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

ఓటీటీ ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో యూత్ ను మెప్పించిన ఈ ప్రేమకథా చిత్రం శుక్రవారం(ఆగస్టు 21) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. మరెందుకు లేటు ఈ వీకెండ్ లో ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీపై ఒక లుక్కేసుకోండి.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన చెన్నై లవ్ స్టోరీ.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Chennai Love Story Movie

Updated on: Aug 21, 2026 | 6:41 AM

వరుస విజయాలతో జోరు మీదున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. జులై 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియల నటన, కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రజెన్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయ్యింది. అలాగే మణిశర్మ పాటలు, బీజీఎమ్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాన్ని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరింది. చెన్నై లవ్ స్టోరీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 21 నుంచి సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు ఇది వరకే ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ కిరణ్ అబ్బవరం సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి రాజేష్ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ప్రముఖ నిర్మాతలు ఎస్కేఎన్, సాయి రాజేష్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు త్రిగుణ్, దేవీ ప్రసాద్, సిరి హన్మంతు, పి వాసు తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఇక చెన్నై లవ్ స్టోరీ సినిమా కథ విషయానికి వస్తే.. టైటిల్ కు తగ్గట్టుగానే చెన్నై నగరం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. దర్శకుడు కావాలనుకునే ఒక అనాథ కుర్రాడు, అదే సమయంలో పీఠలమీదే పెళ్లి ఆగిపోయిన అమ్మాయి ల మధ్య స్నేహం, ప్రేమ.. ఆ తర్వాత పరిణామాలతో ఆద్యంతం ఎమోషనల్ గా ఈ సినిమా సాగుతుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఒక కొత్త రకమైన ప్రేమకథ అని ఈ సినిమాకు రివ్యూలు, ప్రశంసలు వచ్చాయి. మరి థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన చెన్నై లవ్ స్టోరీ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో చెన్నై లవ్ స్టోరీ స్ట్రీమింగ్..

 

చెన్నై లవ్ స్టోరీ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us