
ఈ వారం ఓటీటీలో బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై, త్రాష్ తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా విషయానికి వస్తే.. ఇదొక యూత్ ఫుల్ లవ్ స్టోరీ. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్ వీర్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ ది రివేంజ్ ను తట్టుకుని మరీ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక అమ్మాయినైనా ప్రేమించాలనుకునే టీనేజర్ లైఫ్ లోకి ముగ్గురు అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ప్రవీణ్ మాత్రం స్కూల్ లైఫ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక్కరినైనా ప్రేమించాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. కానీ అతని జీవితంలోకి గంగవల్లి (అనీషా), ప్రేషిక (మీనాక్షి), సోనాల్ (ప్రియాన్షి) వస్తారు. ప్రవీణ్ కు ప్రేషిక, సోనాల్ బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత గంగవల్లితో లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు ప్రవీణ్ ఫ్యామిలీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? చివరకు ఏం జరిగింది? అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించిన ఈ సినిమా పేరు యూత్. కెన్ కరుణాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేశ్ తదితరులు నటించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 16 నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ్ తో పాటు తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ యూత్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
Ada ennada ithu kaadhaluku vandha sodhanai? 🤭💔 pic.twitter.com/gJHkSEqa9N
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.