
గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను భయపెడుతూనే బాక్సాఫీస్ వద్ద రూ.270 కోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. కేవలం రూ. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఇక శుక్రవారం (జూన్ 12) ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై భారీ వ్యూయర్ షిప్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా కథ మొత్తం ఒక పురాతన ప్యాలెస్ చుట్టూ తిరుగుతుంది. హీరోకు తన పూర్వీకుల నుంచి వారసత్వంగా ఈ పాత కోట వస్తుంది. అయితే ఈ కోట ఉన్న ఊరిని ఒక వింత శాపం వెంటాడుతుంటుంది. అదేంటంటే.. ఒక దుష్ట శక్తి అక్కడి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిపోతుంటుంది. దెయ్యం భయంతో ఊరిలో ఎవరూ పెళ్లిళ్లు చేసుకోరు. కానీ ఈ విషయం తెలియని హీరో తన చెల్లెలికి అదే ఓల్డ్ ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాడు. మరి పెళ్లి వేడుక కోసం ఆ కోటలోకి దిగిన హీరో, అతని కుటుంబీకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో తన పెళ్లిని జరిపించాడా? లేదా? అసలు ఆ దెయ్యం కథేంటి? ఆ దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పేరు ‘భూత్ బంగ్లా’. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ మూవ భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు రూ. 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 270 కోట్లు కలెక్ట్ చేసింది. తద్వారా 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బి, జిషు సేన్‌గుప్తా, అశ్రాని, మనోజ్ జోషి, మిథిలా పాల్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్షయ్ కుమార్, ఏక్తా కపూర్, శోభా కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన భూత్ బంగ్లా సినిమా జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం ఓటీటీలో హారర్ కామెడీ చిత్రాలకు మంచి ఆదరణ, డిమాండ్ ఉంటోంది. అందుకు తగ్గట్టే భూత్ బంగ్లా సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో కూడా రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ సొంతం చేసుకుంటోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి