Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా జులై 10న థియేటర్లలో విడుదలైంది. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Lenin OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి ‘లెనిన్’! అఖిల్ అక్కినేని 100 కోట్ల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lenin Movie

Updated on: Aug 01, 2026 | 5:44 PM

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లెనిన్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న లెనిన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు శనివారం (ఆగస్టు 1) అయ్యగారి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. లెనిన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఆగస్టు 07 నుంచి అఖిల్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇదే క్రమంలో అఖిల్ సినిమాకు సంబంధించి ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

లెనిన్ సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను, శత్రు తదితరులు ఈ సినిమా లో ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  లెనిన్ సినిమాను తెరకెక్కించారు. ఈ లెక్కన 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందంటే ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లే. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో అయ్యగారి సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జీ 5 ఓటీటీలో అఖిల్ అక్కినేని లెనిన్..

మరో 6 రోజుల్లో ఓటీటీలోకి అయ్యగారి ఆగమనం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us