
అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నదాని అందానికే కాదు, డ్యాన్స్‌కు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ బ్యూటీ తన డ్యాన్స్, నడుము వయ్యారాలతో కుర్రారు గుండెల్లో దడ పుట్టిస్తుంది. తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

చాలా తక్కువ సమయంలో యూత్‌లో మంచి క్రేజ్, విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ ఒకరు. ఈ అమ్మడు పర్ఫామెన్స్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కేవలం సినిమాల్లో సాంగ్స్ చేయడం, నటించడమే కాకుండా, ప్రత్యేకమైన ఈవెంట్స్‌లో ఈ బ్యూటీ స్పెషల్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరస ఆఫర్లతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభపు ఈవెంట్‌లో ఈ బ్యూటీ ప్రదర్శన ఇవ్వనుంది.

2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో నోరా పాల్గొననున్నారు అనే విషయాన్ని ఫిఫా ఎక్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గతంలో ఫిపా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన ఈ చిన్నది, 2026, ఈ సంవత్సరం ఫీఫా ప్రారంభపు వేడుకల్లోనే అందరినీ డ్యాన్స్‌తో మాత్రమే కాకుండా పాట పాడుతూ అలరించనున్నారంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది.

ఇక ఈ సంవత్సరం ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు, 2026 జూన్ 12న కెనడాలోని టొరంటోలో ఉన్న BMO ఫీల్డ్‌లో జరగనున్నాయి. ప్రపంచ క్రీడాకారులు ఎంతగానో ఎదురు చూసే ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు పాల్గొంటాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సీకో, కెనాడాలో దశల వారిగా ఈ టోర్ని కొనసాగనుంది.

ఇక ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో పాటు, అలియానా, జెస్సీ రేయెజ్, అలెస్సియా కారా, అలనిస్ మోరిసెట్, వెగాడ్రీమ్ వంటి కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారంట.