Son Of Movie Review: ‘సన్ ఆఫ్’ మూవీ రివ్యూ.. తండ్రీ, కొడకుల ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయిందా..?

తండ్రీ కొడుకుల అనుబంధం, సెంటిమెంట్‌ నేపథ్యంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తుల సతీష్ దర్శకత్వంలో ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. నేటి యువతకు ఎలాంటి మెసేజ్ ఇచ్చింది..? ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించింది..? పూర్తి రివ్యూలో చూద్దాం.

Son Of Movie Review: సన్ ఆఫ్ మూవీ రివ్యూ.. తండ్రీ, కొడకుల ఎమోషనల్ డ్రామా వర్కౌట్ అయిందా..?
Son Of Movie Review

Edited By:

Updated on: Feb 28, 2026 | 8:37 AM

మూవీ రివ్యూ: సన్ ఆఫ్

నటీనటులు: వినోద్ కుమార్, సాయి సింహాద్రి, మీరా రాజ్, విష్ణు ఇంటూరి తదితరులు

ఎడిటింగ్: అమర్ నాథ్

సంగీతం: రిషి ఎం

సినిమాటోగ్రఫీ: VRK నాయుడు

దర్శకత్వం: బత్తుల సతీష్

నిర్మాత: సాయి సింహాద్రి

 

కథ:

వెంకట్రావు (వినోద్ కుమార్) భార్య చనిపోవడంతో అన్నీ తానై కొడుకు ఆనంద్ (సాయి సింహాద్రి)ని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. కానీ ఆనంద్ మాత్రం తండ్రి అంచనాలకు ఏమాత్రం తగ్గట్టు ఉండడు.. చదువులన్నీ గాలికి వదిలేసి ఫెయిల్ అవుతుంటాడు. ఇక చిన్నప్పటి నుంచి అను (మీరా రాజ్)తో ఆనంద్‌కు లవ్ ట్రాక్ ఉంటుంది. వీళ్ల ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. కట్ చేస్తే.. ఎంగేజ్‌మెంట్ రోజు వెంకట్రావు పెద్ద బాంబ్ పేల్చుతాడు. ఎలాంటి పనీపాటా లేకుండా గాలికి తిరిగే నా కొడుకుకి మీ అమ్మాయిని ఎలా ఇస్తారు? అని అందరి ముందు రచ్చ చేసి ఆ పెళ్లిని ఆపేస్తాడు. ఈ అవమానంతో రగిలిపోయిన ఆనంద్.. వారసత్వంగా తనకు రావాల్సిన ఇల్లు, ఆస్తి కోసం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆస్తి ఇవ్వడానికి తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి? ఓ బిడ్డ బాధ్యత తీసుకున్న ఆనంద్ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? చివరకు లైఫ్ వాల్యూ తెలుసుకుని తన ప్రేమను దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ.

కథనం:

తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో కూడిన కథలు టాలీవుడ్‌కు కొత్తేమీ కాదు. అదే కోవలో దర్శకుడు ‘సన్ ఆఫ్’ కథను డిజైన్ చేసుకున్నాడు. బాధ్యత లేకుండా గాలికి తిరిగితే లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఇందులో చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో తన ఫ్రెండ్స్‌తో తిరగడం, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, తండ్రితో వచ్చే క్లాషెస్.. ఇలా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే కాన్ఫ్లిక్ట్ సినిమాకు అసలైన టర్నింగ్ పాయింట్. ఇక సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా, తండ్రి కండిషన్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా ఓ బిడ్డను పెంచడానికి హీరో పడే కష్టాలు, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌తో కన్నీళ్లు పెట్టిస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఓకే. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడికి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే అంతా కొత్తవాళ్ళు ఉండటంతో సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

నటీనటులు:

డెబ్యూ హీరో అయినా సాయి సింహాద్రి ఆనంద్ రోల్‌లో బాగున్నాడు. ఎమోషన్స్‌ను బాగా క్యారీ చేశాడు. ఫాదర్ క్యారెక్టర్‌లో సీనియర్ నటుడు వినోద్ కుమార్ తన అనుభవాన్ని రంగరించి జీవించేశాడు. కొత్త హీరోయిన్ మీరా రాజ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు మ్యూజిక్ గుడ్ ఫీల్ ఇస్తుంది. విజువల్స్ మెయిన్ పిల్లర్స్ అని చెప్పాలి. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగే పాటలు ప్లెజెంట్‌గా ఉన్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను కెమెరామెన్ చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్ గా సన్ ఆఫ్.. బాధ్యతల గురించి చెప్పే ఎమోషనల్ డ్రామా..!

,

Follow Us