With Love Movie Review: విత్ లవ్ మూవీ రివ్యూ.. మనసుని తాకే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!

చెప్పే విధానం నిజాయితీగా ఉంటే చాలు.. ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. విత్ లవ్ ఆ అంచనాలను నిజం చేస్తూ ఒక స్వచ్ఛమైన అనుభూతిని మిగిల్చింది. అభిషన్ జీవింత్, అనస్వరా రాజన్ జంటగా నటించిన ఈ సినిమాతో మదన్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

With Love Movie Review: విత్ లవ్ మూవీ రివ్యూ.. మనసుని తాకే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ..!
With Love Movie Review In Telugu

Edited By:

Updated on: Feb 06, 2026 | 8:37 AM

మూవీ రివ్యూ: విత్ లవ్

నటీనటులు: అభిషన్ జీవింత్, అనస్వర రాజన్, సచిన్ నాచిప్పన్, కావ్య అనిల్ తదితరులు

సంగీతం: సీన్ రోల్డాన్

సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ

ఎడిటర్: సురేష్ కుమార్

నిర్మాత: సౌందర్య రజినీకాంత్

దర్శకుడు: మదన్

చెప్పే విధానం నిజాయితీగా ఉంటే చాలు.. ప్రేమకథలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. విత్ లవ్ ఆ అంచనాలను నిజం చేస్తూ ఒక స్వచ్ఛమైన అనుభూతిని మిగిల్చింది. అభిషన్ జీవింత్, అనస్వరా రాజన్ జంటగా నటించిన ఈ సినిమాతో మదన్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సత్య (అభిషన్ జీవింత్)కి అరెంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ తన చెల్లి ఒత్తిడి మేరకు ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి మోనిష (అనస్వరా రాజన్) పరిచయం అవుతుంది. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. ఒక చిన్న యాదృచ్చిక సంఘటనగా మొదలైన వారి ప్రయాణం.. ఫస్ట్ లవ్, బ్రేకప్, గతాన్ని తలుచుకోవడం, వదిలేసిన జ్ఞాపకాలను మళ్ళీ స్పృశించడం అనే భావోద్వేగాల వైపు ఎలా సాగిందనేదే మిగతా కథ.

కథనం:

సినిమా మొదలైనప్పటి నుంచే ఒక లైట్-హార్టెడ్, ఫీల్ గుడ్ వైబ్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఫిస్టాఫ్ చాలా సరదాగా, బ్రీజీగా సాగిపోతుంది. ఇందులో ఉన్న హ్యూమర్, కథ చెప్పే విధానం ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫస్ట్ లవ్ లో ఉండే అమాయకత్వం, చిన్న చిన్న గొడవలు, అనుకోని పరిచయాలను చాలా సహజంగా చూపించారు. ముఖ్యంగా స్కూల్ సీన్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక సెకండాఫ్ కథలో ఎమోషనల్ డెప్త్ పెరుగుతుంది. కానీ ఎక్కడా మెలోడ్రామాగా మారకుండా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. గతాన్ని అంగీకరించడం, పర్సనల్ రిగ్రెట్స్ ని దాటుకుని ముందుకు రావడం అనే అంశాలను చాలా మెచ్యూర్డ్ గా చూపించారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫీల్ గుడ్ సినిమాల్లో విత్ లవ్ ఒకటిగా నిలుస్తుంది. ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాదు, గతాన్ని గౌరవంగా చూస్తూ వర్తమానంలోకి ఎలా రావాలో చెప్పే ఒక అందమైన ప్రయాణం. స్వీట్ గా, సింపుల్ గా, రిలేటబుల్ గా ఉండే రొమాంటిక్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

నటీనటులు:

అభిషన్ జీవింత్ కు ఇది హీరోగా మొదటి సినిమా అంటే నమ్మలేం. చాలా నేచురల్ గా, ఎక్కడా అతి లేని నటనతో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ మీద అతని కాన్ఫిడెన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. అనస్వరా రాజన్ ఎప్పటిలాగే తన నటనతో మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎమోషనల్ ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆమె చేసిన పాత్ర చాలా కొత్తగా, రిఫ్రెషింగ్ గా ఉంది. కావ్య అనిల్ తన పాత్రలో ఒక స్వీట్ నెస్ ని, ఫస్ట్ క్రష్ తాలూకు జ్ఞాపకాలను చక్కగా పండించింది. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకి అతిపెద్ద బలం సీన్ రోల్డాన్ సంగీతం. రొమాంటిక్ సీన్స్ ని, ఎమోషనల్ మూమెంట్స్ ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరో స్థాయికి తీసుకెళ్ళాడు. ఎడిటింగ్ పర్లేదు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ చాలా వార్మ్ గా, కంటికి నచ్చేలా ఉంది. కొత్తవారితో తీసినా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. మదన్ దర్శకుడుగా సినిమాకు న్యాయం చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా విత్ లవ్.. బ్యూటిఫుల్ & నోస్టాల్జిక్ లవ్ జర్నీ..!