Mareechika Review: మరీచిక మూవీ రివ్యూ.. అనుపమ పరమేశ్వరన్, రెజీనా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

అందాల భామ అనుపమ పరమేశ్వరన్, టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మరీచిక’. ఈ సైకలాజికల్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

Mareechika Review: మరీచిక మూవీ రివ్యూ.. అనుపమ పరమేశ్వరన్, రెజీనా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?
Mareechika Movie

Edited By:

Updated on: May 29, 2026 | 1:29 PM

మూవీ రివ్యూ: మరీచిక

నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, రెజీనా కసాండ్రా, విరాజ్ అశ్విన్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు

ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ

సినిమాటోగ్రఫీ: అరవింద్ కన్నబ్రెయిన్

సంగీతం: ఇళయరాజా

కథ, లిరిక్స్, డైలాగ్స్: లక్ష్మీ భూపాల

నిర్మాతలు: రాజీవ్, మేఘన

దర్శకుడు: సతీష్ కాశెట్టి

కథ:

సంజు (విరాజ్ అశ్విన్) తండ్రి పెద్ద పొలిటీషియన్ అయినా కూడా.. ఆస్తులున్నా కూడా సొంతంగా కేఫ్ పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అతన్ని చాలా కాలంగా వెంకట లక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమిస్తుంటుంది. కానీ మనసులో మాట మాత్రం అతనికి చెప్పదు. అలా నడుస్తున్న వీళ్ళ మధ్యలోకి అమెరికా నుంచి మరీచిక (రెజీనా కసాండ్రా) వస్తుంది. ఇండియాకు వచ్చిన మరీచికకు పరిచయమైన ఒకే ఒక్క స్నేహితురాలు వెంకటలక్ష్మి కావడంతో ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటుంది. సంజుకి మరీచికని పరిచయం చేయడంతో.. వాళ్లిద్దరూ ప్రేమలో పడతారు. అలా సాగిపోతున్న సమయంలో సడన్‌గా ఒకరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వెంకటలక్ష్మి.. సంజును మరీచిక చంపేసిందని కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.. కానీ సంజు బతికే ఉన్నాడని తర్వాత తెలియడంతో కథ మరో మలుపు తిరుగుతుంది.. అసలు వెంకటలక్ష్మి ఎందుకలా చెప్పింది.. సంజు, మరీచిక మధ్య ఉన్న బంధమేంటి..? ఈ ముగ్గురూ కలిసి ఏం చేసారు అనేది మిగిలిన కథ..

కథనం:

మరీచిక సినిమాకు ప్రధాన బలం, ప్రాణం అంతా కథనమే. డైరెక్టర్ సతీష్ కాశెట్టి ఎంచుకున్న పాయింట్ కాంప్లెక్స్‌గా ఉన్నా.. దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం చాలా మోడరన్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, వాళ్ళ జీవితాల్లోని కాన్ఫ్లిక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నా… ఆ తర్వాత కథ అనూహ్యంగా ఊపందుకుంటుంది. ఒక సాధారణ డ్రామాలా మొదలైన సినిమా, మెల్లగా ఒక డార్క్ థ్రిల్లర్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే మంచి ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై క్యూరియాసిటీని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ బ్రెయిన్‌కు పనిచెబుతూ సాగుతుంది. ఓసారి వచ్చి సంజును మరీచిక చంపేసిందంటారు.. మరోసారి మరీచికనే సంజు చంపేసాడంటారు.. ఇంకోసారి ఇద్దరూ కలిసి వెంకట లక్ష్మి పాత్రను ఏదో చేసారనే అనుమానాలు వచ్చేలా స్క్రీన్ ప్లే రాసారు. ప్రతీ సీన్‌లోనూ ఏదో జరగబోతోంది అనే ఉత్కంఠను మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త లాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా అనుపమ ట్రాన్సఫర్మేషన్ మొదలైన తర్వాత కథ మరింత వేగంగా ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్ కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉంది.. కానీ ఆడియన్స్ ఊహకు అందకుండా నాన్-లీనియర్ పద్ధతిలో కథను నడిపించడంలో స్క్రీన్ ప్లే రైటర్స్ చూపించిన నేర్పు మెచ్చుకోవాలి. ఎమోషన్స్, సస్పెన్స్, డ్రామా… ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేస్తూ, క్లైమాక్స్ వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టేలా ఈ కథనాన్ని డిజైన్ చేశారు. లాజిక్స్ వెతికే వాళ్లకు కొన్ని ప్రశ్నలు మిగిలినా.. ఓవరాల్‌గా ఈ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక సాలిడ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. కొన్నిచోట్ల మాత్రం లాజిక్ ఉండదు.. మరికొన్నిచోట్ల కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఒకే సీన్ మళ్లీ మళ్లీ రిపీట్ అయినట్లు ఉంటుంది. అయినా కూడా డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవాళ్లకు మరీచిక మంచి ఛాయిసే.

నటీనటులు:

నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కచ్చితంగా మరో స్థాయికి తీసుకెళ్లింది. రెజీనా కసాండ్రా టైటిల్ రోల్‌కు ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్స్‌తో పాటు కాంప్లెక్స్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటన అద్భుతం. ఇక అనుపమ పరమేశ్వరన్‌కు ఇది ఒక బ్రేక్-అవే రోల్ అని చెప్పాలి. తన రెగ్యులర్ బబ్లీ అండ్ క్యూట్ లుక్స్ పక్కనపెట్టి, చాలా ఇంటెన్స్‌గా, మెచ్యూర్డ్‌గా నటించి సర్ ప్రైజ్ చేసింది. విరాజ్ అశ్విన్ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించి మెప్పించాడు. కథను మలుపుతిప్పే కీలక సన్నివేశాల్లో విరాజ్ యాక్టింగ్ బాగుంది. మిగిలిన వాళ్లు కూడా ఓకే..

టెక్నికల్ టీం:

మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు సోల్. సైకలాజికల్ థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్స్ మూడ్‌ని, సీన్స్‌లోని ఎమోషన్‌ను తన మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. కాకపోతే ఆ ఫ్రేమింగ్, డార్క్ టోన్స్, లైటింగ్ వాడుకున్న విధానం చూస్తే సినిమా కాస్త పాతదే అని అర్థమైపోతుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉంటే సెకండ్ హాఫ్‌లో ఉన్న చిన్నపాటి లాగ్ కూడా తగ్గేది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమా స్థాయికి తగ్గట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి. దర్శకుడు సతీష్ టేకింగ్ బాగుంది.. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే, మాటలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మరీచిక.. డీసెంట్ సైకలాజికల్ థ్రిల్లర్..!

Follow Us