Maha Samudram: సముద్ర తీరాన అందాల అదితి.. మెస్మరైజ్ చేస్తోన్న ‘చెప్పకే.. చెప్పకే’ మేకింగ్ వీడియో. మీరూ చూసేయండి..

Maha Samudram: శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం 'మహా సముద్రం'. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో...

Maha Samudram: సముద్ర తీరాన అందాల అదితి.. మెస్మరైజ్ చేస్తోన్న చెప్పకే.. చెప్పకే మేకింగ్ వీడియో. మీరూ చూసేయండి..

Updated on: Sep 28, 2021 | 8:36 AM

Maha Samudram: శర్వానంద్‌, సిద్దార్థ్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మహా సముద్రం’. ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. చాలా రోజుల తర్వాత సిద్దార్థ్‌ తెలుగులో నటిస్తోన్న చిత్రం కావడం భారీ తారాగణంతో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. అదితిరావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగాయి.

ఇక ఈ సినిమాను అక్టోబర్‌ 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమాలోని ‘చెప్పకే.. చెప్పకే’ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సముద్రంలో ఒడ్డున తెరకెక్కించిన ఈ పాటలో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా అదితిరావు ప్రధానంగా చిత్రీకరించిన ఈ సాంగ్‌లో అందాల తార చీర కట్టులో ఆకట్టుకుంటోంది. ఆర్‌ఎక్స్‌ 100 వంటి సంచలనం తర్వాత అజయ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: Electric Scooter: ఒక్కసారి చార్జ్‌ చేస్తే 480 కిలోమీటర్లు.. మార్కెట్లోకి రానున్న మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

No Cost EMI: ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ వల్ల కలిగే లాభాలు ఏమిటి..?

Writing a Will: వీలునామా రాస్తున్నారా..? ఈ విషయాలు తప్పనిసరిగా గుర్తించుకోండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us