KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

లెజెండరీ గాయని చిత్ర, తన సంగీత ప్రస్థానంలోని కీలక ఘట్టాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. శాస్త్రీయ సంగీత పునాదులు, సినీ రంగంలో ఎదురైన సవాళ్లు, టాలీవుడ్ హీరోయిన్ చిత్రాల కోసం పాడిన పాటలు, గురువులైన ఇళయరాజా, బాలు గారి ప్రభావం, తెలుగు భాషపై తనకున్న ప్రేమ గురించి వివరించారు.

KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..
Chitra

Updated on: Nov 19, 2026 | 10:18 PM

లెజెండరీ గాయని చిత్ర పాటలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆమె గాత్రానికి ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చిత్ర మాట్లాడుతూ… సంగీత ప్రస్థానంలోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రత్యేకించి విజయశాంతి నటించిన చిత్రాల కోసం పాటలు పాడిన అనుభవాలు, తన గురువులు, తెలుగు భాషపై ఆమెకున్న ప్రేమ గురించి సవివరంగా మాట్లాడారు. తనదైన ప్రత్యేక శైలి, పరిపూర్ణతతో తెలుగు సినీ సంగీతంలో తనదైన ముద్ర వేసుకున్న చిత్ర, సుశీలమ్మ, జానకమ్మ వంటి గొప్ప గాయనీమణుల పాటలను వింటూ పెరిగినట్లు తెలిపారు. గొప్ప శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్నప్పటికీ, ఆమె తన గొంతును సినిమా పాటలకు అనుగుణంగా మలచుకోవడానికి కృషి చేశారని పేర్కొన్నారు. శాస్త్రీయ సంగీతం ఒక పక్కన పెట్టి, ఫిల్మ్ సాంగ్స్‌పైనే పూర్తి దృష్టి సారించానని వివరించారు. లైవ్ కచేరీలు, స్టూడియో రికార్డింగ్‌ల మధ్య గల వ్యత్యాసాన్ని వివరిస్తూ, లైవ్ ప్రదర్శనలు ఒత్తిడితో కూడుకున్నవని, స్టూడియోలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. మొబైల్ రికార్డింగ్‌ల వల్ల లైవ్ షోలలో సహజంగా జరిగే పొరపాట్లు ప్రజల్లోకి తప్పుగా వెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయశాంతి చిత్రాల కోసం పాటలు పాడటం తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన అధ్యాయమని చిత్ర పేర్కొన్నారు. ఆ పీరియడ్‌లో ఎన్నో ఎమోషనల్ పాటలు పాడానని, కొన్ని సందర్భాల్లో రెండు రోజుల పాటు గొంతుకు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చిందని గుర్తుచేసుకున్నారు. “ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డిఫరెంట్ ఫీల్ కూడా. చాలా అరిచి పాడినట్టు సాంగ్స్ కూడా వస్తున్నాయి. అలాగే చాలా హస్కీగా పాడే సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఒక్క రోజు మనం ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఈరోజు ఎలాంటి పాట వస్తుందో మనకు తెలీదు” అని సినిమా పాటలలోని వైవిధ్యాన్ని, సవాళ్లను వివరించారు.

చిన్ననాటి నుండే సంగీతం తన జీవితంలో ఒక భాగమైందని చిత్ర తెలిపారు. కాలేజీలో సంగీతాన్ని ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకుని, ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కీర్తనలు, వర్ణాలు నేర్చుకున్నానని చెప్పారు. ఓమనకుట్టి టీచర్ వద్ద ప్రత్యేక శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చాలా కఠినంగా ఉండేవారని, సోదరితో కలిసి పాడటం, సోదరుడు మృదంగం వాయించడంతో సంగీతం నిత్య జీవితంలో భాగంగా మారిందని వివరించారు. తెలుగు భాషపై చిత్రకు అపారమైన ప్రేమ ఉంది. “తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈజీగా వచ్చింది నాకు భాష” అని ఆమె తెలిపారు. సినిమా పాటలు పాడుతున్నప్పుడు దర్శకులు, సంగీత దర్శకులు, గీత రచయితలు తెలుగులోనే మాట్లాడటం వల్ల భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. ఒక యోగా మాస్టర్ కూడా నిత్యం తెలుగులో మాట్లాడటం తన భాషా పరిజ్ఞానాన్ని పెంచిందని పేర్కొన్నారు. తన జీవితంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (బాలు గారు) పాత్ర అద్భుతమైనదని చిత్ర కొనియాడారు. తెలుగు పాటల ఉచ్చారణ, వాటికి సరైన భావ వ్యక్తీకరణ ఎలా ఇవ్వాలో బాలు గారి ద్వారానే నేర్చుకున్నానని, ఆయన తన పెద్ద ఇన్స్పిరేషన్, మెంటర్ అని స్పష్టం చేశారు. తాను తెలుగు స్క్రిప్టును చదవగలిగినప్పటికీ, తన నోట్స్‌లో పాటలను మలయాళంలో రాసుకుంటానని, కేవలం హిందీ పాటలకు మాత్రమే హిందీలో రాస్తానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవల ఆధారంగా వచ్చిన సినిమా.. శోభన్ బాబును స్టార్ హీరోగా నిలబెట్టిన మూవీ..

చిత్ర..

Chitra Song S

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us