
Raveena Tandon KGF 2: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ 2. 2018లో ఘన విజయం సాధించిన కేజీఎఫ్ సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతుండగా.. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండెన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందులో రవీనా ఏదో చట్టసభలో కూర్చున్నట్లు ఉండగా.. క్రూరత్వానికి అధినేత్రి అని ప్రశాంత్ ఆ లుక్‌కి కామెంట్ పెట్టారు. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కాగా ఈ మూవీలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అధీరగా కనిపించనున్నారు. ప్రకాష్ రాజు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కిర్గందురు నిర్మిస్తోన్న ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Read More:
నాగ్‌కి స్టంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్ హీరో తండ్రి
జూనియర్ చిరు కోసం బెంగళూరు వెళ్లిన నజ్రియా దంపతులు