
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసి మాస్ యాక్షన్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతోపాటు దేవర చిత్రంతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు తారక్. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో విపరీతమైన హైప్ నెలకొంది. ఈ చిత్రం కోసం తారక్ ఇప్పటికే చాలా బరువు తగ్గిపోయి లుక్ పూర్తిగా మార్చేశారు. ఇందులో యాక్షన్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో తారక్ జోడిగా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన ఇమేజ్ ఒక సినిమా విజయంపై ప్రభావం చూపకపోయినా ఫర్వాలేదు కానీ, తన ఇమేజ్ కారణంగా ఒక సినిమాకు రావాల్సిన ప్రాముఖ్యత తగ్గిపోతే అది తనకు చాలా బాధ కలిగిస్తుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నిర్మాత దిల్రాజ్ ఒక సందర్భంలో బొమ్మరిల్లు కథను తనకు చెప్పారని.. ఆ స్క్రిప్ట్ తనకు బాగా నచ్చిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చిత్రాన్ని చేయలేకపోయానని ఆయన వెల్లడించారు. “అయ్యో ఇదేంటి మిస్ అయిపోతుందే నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ అది” అని తాను చాలా బాధపడినట్లు ఎన్టీఆర్ తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
ఆ సినిమాను వదులుకోవడానికి ప్రధాన కారణం తన అప్పటి ఇమేజేనని ఎన్టీఆర్ వివరించారు. “ఇమేజ్ పరంగా నా ఇమేజ్ ఆ సినిమాకి న్యాయం చేయదు” అని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా తన సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకులు తన నుండి ఫైట్లు, డాన్సులు, కామెడీ, హీరోయిజం, పవర్ఫుల్ డైలాగ్స్ ఆశిస్తారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. అలాంటి అంశాలు లేకుండా ఒక సినిమా చేస్తే, అది ప్రేక్షకులను మోసం చేసినట్లు అవుతుందని, సినిమాకు కూడా న్యాయం చేయలేనని ఆయన భావించారు. అందుకే మనసు బాధపడినా, ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అనూహ్యంగా, బొమ్మరిల్లు చిత్రం సిద్ధార్థ్, జెనీలియాలతో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాత దిల్రాజ్లకు మంచి పేరు తెచ్చింది. ఎన్టీఆర్ ఈ చిత్రంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
Bommarillu
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..