‘జెర్సీ’ సినిమాకు అరుదైన ఘ‌న‌త

|

Jul 31, 2020 | 4:09 PM

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ చిత్రం `జెర్సీ`.

జెర్సీ సినిమాకు అరుదైన ఘ‌న‌త
Follow us on

Jersey In Toronto International Film Festival : భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ చిత్రం `జెర్సీ`. తెలుగునాట ఘన విజయం సాధించటమే కాక, పలు ప్రశంసలు అందుకుందీ చిత్రం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ త‌న ప‌నిత‌నంతో సినిమాని మ‌రో మెట్టు ఎక్కించాడు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం దర్శకత్వం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది.

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి గెలిచిన తీరు క‌థాశంగా ఈ ‘జెర్సీ’ చిత్రం రూపొందింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ ఎంపికవటం చాలా సంతోషంగా ఉంద‌న్నారు చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో మూవీ ప్రదర్శన కాబోతుంద‌ని తెలిపారు. భార‌త స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో ‘షాహిద్ కపూర్’ తో ఈ ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్ అవుతోన్న విష‌యం తెలిసిందే.

 

Read More : రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య