బాలయ్య మూవీలో జయప్రద..!

| Edited By:

Sep 27, 2020 | 5:08 PM

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య

బాలయ్య మూవీలో జయప్రద..!
Follow us on

Balayya Boyapati movie: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నారు మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే 30 శాతానికి పైగా షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ మూవీలో ఓ కీలక పాత్రలో సీనియర్ నటి జయప్రద నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జయప్రదను సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే బాలయ్య, జయప్రద గతంలో మహారథి చిత్రంలో నటించారు.

ఇక ఈ మూవీ ద్వారా కొత్త హీరోయిన్‌ టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. మిర్యాలగూడ రవీంద్ర రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఇదివరకు సింహా, లెజండ్ చిత్రాలు తెరకెక్కగా.. అవి రెండు పెద్ద విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు తెరకెక్కబోతున్న ఈ మూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

మరింత అప్రమత్తంగా ఉండండి: మంత్రి అనిల్ కుమార్‌

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం..13 మంది సజీవదహనం