Janhvi Kapoor : జాన్వీ కపూర్ ను ముద్దడిగిన అభిమాని.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన బ్యూటీ

అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ను ముద్దడిగిన అభిమాని.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన బ్యూటీ
Janhvi Kapoor(File Photo)

Updated on: Mar 22, 2021 | 1:08 PM

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీ దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ‘దఢక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జాన్వీ నటనతోపాటు మంచి అభినయం కనబరిచి ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా  ఉంటుంది. తన సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.
తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ చిన్నది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ అభిమాని హద్దుమీరి మనం ముద్దు పెట్టుకుందామా అని అడిగాడు. అతడికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది జాన్వీ. ముద్దాడిగిన అభిమానికి సంధానం చెప్తూ మాస్క్ ధరించిన ఫోటో పెట్టి నో అని సమాధానం చెప్పింది జాన్వీ. అంతే కాదు మారి కొంతమంది అడిగిన ఇలాంటి చిలిపి ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పింది జాన్వీ. అలాగే తన అభిమాన కోస్టార్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, జాన్వి తన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమాలో సహనటుడు పంకజ్ త్రిపాఠిని కౌగిలించుకునే ఫోటోను షేర్ చేసింది. జాన్వి తన రాబోయే చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ను ఇటీవల ముగించింది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ నిర్మించారు.  సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్, మీతా వశిష్త్, నీరజ్ సూద్  కీలకపాత్రలో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Janhvi

మరిన్ని ఇక్కడ చదవండి :

Vijay Sethupathi : బుల్లితెరపై సందడి చేయనున్న మక్కల్ సెల్వన్.. త్వరలోనే టీవీషోతో రానున్న విజయ్ సేతుపతి..

Priyamani : జోరు పెంచిన యంగ్ టైగర్ హీరోయిన్.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీ

Loading...
Unable to load recommendations.
Follow Us