Janhvi Kapoor: నా సామర్థ్యం ఏంటో చూపించాలనుకుంటున్నాను… ఆసక్తికర విషయాలను వెల్లడించిన అందాల తార.

శ్రీదేవి తనయగా గుర్తింపు ఉన్నా 'ధడక్‌' వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఇండస్ట్రీని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది జాన్వీకపూర్‌. ఇక రెండో సినిమాలోనూ గ్లామర్‌కు దూరంగా నటించిందీ చిన్నది...

Janhvi Kapoor: నా సామర్థ్యం ఏంటో చూపించాలనుకుంటున్నాను... ఆసక్తికర విషయాలను వెల్లడించిన అందాల తార.

Updated on: Feb 05, 2021 | 5:32 AM

Janhvi Kapoor Interview: తల్లి, తండ్రి ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.. ఇద్దరూ మంచి క్రేజ్‌ ఉన్నవారే.. తాను తలుచుకుంటే తొలి సినిమాలోనే స్టార్‌ హీరోతో, భారీ బడ్జెట్‌ సినిమాలో నటించే అవకాశమున్నా.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది నటి జాన్వీకపూర్‌.
శ్రీదేవి తనయగా గుర్తింపు ఉన్నా ‘ధడక్‌’ వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఇండస్ట్రీని ఒక్కసారి ఆశ్చర్యానికి గురి చేసింది జాన్వీకపూర్‌. ఇక రెండో సినిమాలోనూ గ్లామర్‌కు దూరంగా నటించిందీ చిన్నది. జాన్వీకపూర్‌ ప్రస్తుతం తమిళంలో నయనతార నటించిన ‘కోకో’ సినిమా రీమేక్‌.. ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తనకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది. భవిష్యత్తులో ఎలాంటి చిత్రాల్లో నటించాలనుందన్న వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ‘నాకు ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేదు. నటిగా వీలైనంత విభిన్నత చూపించాలనుంది. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే పాత్రలకోసం ఆసక్తిగా చూస్తున్నాను. సవాళ్లు ఉన్న పాత్రల్లో నటించాలి.. అప్పుడే మజా ఉంటుంది. నా తొలి రెండు సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నటిగా నాకెంత సామర్థ్యం ఉందో తదుపరి సినిమాల ద్వారా చూపించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: Dr.Rajasekhar : షూటింగ్ మొదలు పెట్టిన సీనియర్ హీరో.. రాజశేఖర్ కెరీర్‌‌‌‌‌‌లో 91వ చిత్రంగా ‘శేఖర్’

Loading...
Unable to load recommendations.
Follow Us