హైపర్ ఆది.. కామెడీ పంచులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. బుల్లితెరపై అతను వేసే పంచులు, డైలాగులకు భారీగానే అభిమానులున్నారు. అయితే టీవీ ప్రేక్షకులను నవ్వించే క్రమంలోనే కొన్నిసార్లు వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు హైపర్ ఆది. ఇప్పుడు కూడా ఓ హీరో అభిమానులు ఆదిపై దాడి చేశారని, ఇంకొందరు దాడి చేయడానికి ఎదురుచూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టి పారేశాడు ఆది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసి తనపై దాడి వార్తలకు క్లారిటీ ఇచ్చేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల ఓ టీవీ షోలో హైపర్ ఆది ఓ యువ హీరోను కించపరచాడని, అందుకే అతని అభిమానులు కోపంగా ఉన్నారని, ఆదిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వార్తల సారాంశం. తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఆది ‘నాపై దాడి చేయడం కోసం ఎవరో వెతుకుతున్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అసత్య వార్తలు రాసేవారికి ఒకటే చెబుతున్నా.. మీ దగ్గర డబ్బుల్లేవంటే చెప్పండి.. నాకొచ్చే సంపాదనలో కొంత మేర మీకు ఇస్తాను. మేమందరం సంతోషంగా షూటింగులు చేసుకుంటున్నాం. అందరమూ సంతోషంగా ఉందాం. మేం కూడా హ్యాపీగా ఉన్నాం’ అని వీడియోలో చెప్పకొచ్చాడు ఆది.
Also Read:
Ileana D’ Cruz: తన చేతిమీద ఉన్న పచ్చబొట్లకు అర్ధం చెప్పిన ఇల్లీ బేబీ.. ఆ 3 చుక్కల అర్థం ఏమిటంటే..
Padma Awards: నచ్చినవారికే బహుమానాలు.. వివాదాస్పదమవుతున్న పద్మ అవార్డుల ప్రదానోత్సవం!
RRR Movie: నా పాట చూడు నాటు నాటు అంటూ.. కిరాక్ స్టెప్ప్‌తో అదరగొట్టిన తారక్, చెర్రీలు..