Pooja Hegde: గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బుట్టబొమ్మ.. కారణం అదేనా.?

|

Jun 02, 2022 | 9:33 PM

Pooja Hegde: 'ఒకలైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే అనతికాలంలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది లక్కీ హీరోయిన్‌గా మారింది. పూజా సినిమాలో నటిస్తే చాలు...

Pooja Hegde: గోల్డెన్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న బుట్టబొమ్మ.. కారణం అదేనా.?
Follow us on

Pooja Hegde: ‘ఒకలైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార పూజా హెగ్డే అనతికాలంలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది లక్కీ హీరోయిన్‌గా మారింది. పూజా సినిమాలో నటిస్తే చాలు హిట్‌ కొట్టినట్లే అనే భావన వచ్చింది. తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. అయితే తాజాగా పూజా ఓ భారీ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు నెట్టింట అప్పట్లో వైరల్‌ అయ్యాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పూజా ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవడమే కారణమని తెలుస్తోంది.

పవన్‌ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు తమిళ సినిమా ‘వినోదయ సిత్తం’ రీమేక్‌లో నటించనున్నారు. ఈ కారణంగానే ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ పట్టాలెక్కడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో డేట్స్‌ విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో పూజా సినిమా నుంచి తప్పుకోవడానికే మొగ్గు చూపిందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు సినిమాలతో పాటు, తెలుగులో మహేష్‌-త్రివిక్రమ్‌, విజయ్‌-పూరిల చిత్రం ‘జనగణమన’లోనూ పూజా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..