మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హిరోగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతోగాను ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. కొందరు సినిమా బాగుందని అంటే మరికొందరు మాత్రం కొరటాల శివ బహుబలిని కాపీ చేశాడని కామెంట్స్ చేశారు. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అద్భుతంగా కొట్టాడు. బ్యాగ్రౌండ్ మ్యాజిక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ హైలెట్ అని చెప్పాలి, ముఖ్యంగా ఈ సినిమా ఫ్యాన్స్‌కైతే పూనకాలు తెప్పించిదని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ గూర్చి కొత్త చెప్పాలసిన అవసరం లేదు..కుమ్మేసాడు.. సైఫ్ అలీఖాన్, నటుడు శ్రీకాంత్ కీలక ప్రాతల్లో నటించారు. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన మెరిసింది.
ఎన్టీఆర్ ఈ మధ్య దేవర మూవీ సక్సస్ మీట్‌లో, పలు ఇంటర్వ్యూల్లో హరి అనే వ్యక్తిని పొగిడారు. పలు సందర్భాల్లో జూ. ఎన్టీఆర్ హరి అని పేరు ప్రస్తావించడం సంచలనంగా మారింది. దీంతో ఈ హరి ఎవరు అని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వెత్తుకుతున్నారు. హరిని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్వూలో చెప్పారు. ఈ హరి ఎవరంటే.. తారక్ వల్ల అన్న అయిన కల్యాణ్ రామ్ భార్య తమ్ముడే.. కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలను అన్ని అతనే చూసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ హరి వచ్చిన తర్వాతే తన ఫ్యాన్స్‌కు తారక్ మధ్య దూరం పెరిగిందనే వార్తలపై ఎన్టీఆర్ ఇలా రియాక్ట్ అయ్యారు.
దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్‌గా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా సెక్కూరిటీ ఇష్కూ కారణంగా ఈవెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. దేవర సక్సెస్ మీట్‌ని ఘనంగా నిర్వహించాలని ప్రయత్నించిన మూవీ యూనిట్‌కు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సక్సెస్ మీట్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నగా ఓ సక్సెస్ పార్టీని మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌లో ఎన్టీఆర్ పలు విషయాలను పంచుకున్నాడు.