Rama Prabha: 1400కు పైగా సినిమాలు.. నటి రమాప్రభ ఏం చేస్తుందో తెలుసా..? ఆమె అల్లుడు తెలుగులో తోపు హీరో..

తెలుగు చలన చిత్ర ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది నటి రమాప్రభ. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 1400కు పైగా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా 70, 80లలో దివంగత హాస్యనటుడు రాజబాబుతో కలిసి ఆమె నటించిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రమా ప్రభ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Rama Prabha: 1400కు పైగా సినిమాలు.. నటి రమాప్రభ ఏం చేస్తుందో తెలుసా..? ఆమె అల్లుడు తెలుగులో తోపు హీరో..
Rama Prabha

Updated on: Oct 24, 2026 | 7:05 PM

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటీనటులలో సీనియర్ నటి రమాప్రభ ఒకరు. అప్పట్లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా, ఆ తర్వాత అద్భుతమైన లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె వేల సంఖ్యలో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. దశాబ్దాల పాటు టాలీవుడ్‌ను ఏలిన రమాప్రభ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో లేడీ కమెడియన్‌గా రమాప్రభ సృష్టించిన రికార్డు ప్రత్యేకమైనది. ముఖ్యంగా ప్రముఖ హాస్యనటుడు రాజబాబు తో ఆమె చేసిన జోడీ టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, హాస్యభరితమైన జోడీగా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. హీరోయిన్ నుంచి హాస్య నటిగా మారిన ఆమె, ఆ తర్వాత క్రమంగా అమ్మ, అత్త, , బామ్మ పాత్రలలో ప్రేక్షకులను అలరించారు. తెలుగుతో పాటు కొన్ని తమిళ చిత్రాలలో కూడా నటించి తన నటనతో మెప్పించారు.

ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

అయితే, టాలీవుడ్‌లో ‘కింగ్ ఆఫ్ కామెడీ’గా, ‘నటకిరీటి’గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ తో రమాప్రభకు ఒక విడదీయరాని రక్తసంబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వం ఏమిటనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న రాజేంద్రప్రసాద్ వందలాది సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్న ఆయనకు, సీనియర్ నటి రమాప్రభకు మధ్య అత్తింటి బంధం ఉంది. రమాప్రభకు సొంత పిల్లలు లేకపోవడంతో, ఆమె తన చెల్లెలి కుమార్తెను దత్తత తీసుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత తన చెల్లెలి కూతురిని స్వయంగా దగ్గరుండి నటుడు రాజేంద్రప్రసాద్‌కిచ్చి వివాహం జరిపించారు. అలా వరుసకు రాజేంద్రప్రసాద్ రమాప్రభకు అల్లుడు అవుతారు. ఈ విషయం చాలామంది సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

తొలినాళ్లలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన రమాప్రభ, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా , ఇంటర్వ్యూల ద్వారా తన జ్ఞాపకాలను పంచుకుంటూనే ఉన్నారు. మరోవైపు రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో తనదైన నటనతో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇలా టాలీవుడ్‌లోని ఇద్దరు దిగ్గజ నటీనటులు బంధువులుగా మారడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

రమా ప్రభ, రాజేంద్రప్రసాద్..

Rama Prabha, Rajendra Prasa

 

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

Loading...
Unable to load recommendations.
Follow Us