Disha Patani Life Danger: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన ‘భాగీ 2’, ‘భాగీ 3’ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలు.. మరోవైపు ఫోటోషూట్లతో బిజీగా ఉన్న ఈ భామకు కొందరు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఇప్పుడు ఈ వార్త బీ-టౌన్‌లో హాట్ టాపిక్ అయింది.
కొందరు దుండగులు దిశాకు కాల్ చేసి చంపేస్తామంటూ బెదిరిస్తున్నారట. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లకు కూడా ఫోన్ చేసి దిశాను ఎవరూ కూడా కాపాడలేరని హెచ్చరిస్తున్నారట. దీనితో అలెర్ట్ అయిన పోలీసులు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ చేసే పని పడ్డారు. ఫోన్ కాల్స్ అన్నీ కూడా పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు గుర్తించారట. ఈ కాల్స్ వెనుక అసలైన సూత్రధారి ఎవరన్న దానిపై పోలీసులు దృష్టి పెట్టారట.
Also Read:
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!