Rajamouli: హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ.. వారణాసిపై అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వేదిక పై అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే తనకు హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చాయని అన్నారు జక్కన్న. బ్రెజిల్ లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన వారణాసి సినిమా గురించి ఆసక్తిర అప్డేట్ పంచుకున్నారు.

Rajamouli: హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ.. వారణాసిపై అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..
Ss Rajamouli

Updated on: Oct 23, 2026 | 6:36 PM

తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వేదికపై చాటిచెప్పి, ఆస్కార్ అవార్డు సాధించి చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి అఖండ విజయాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకున్నాయి. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు విడుదలైన ప్రతి చిన్న అప్డేట్ మూవీపై హైప్ క్రియేట్ చేసింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ సక్సెస్ తర్వాత ఆయన హాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా? అక్కడి నుంచి ఆయనకు ఎలాంటి ఆఫర్లు వచ్చాయి? అనే అంశాలపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి, హాలీవుడ్ ఎంట్రీపై తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

బ్రెజిల్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న రాజమౌళికి అక్కడ అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా అక్కడి ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి తన హాలీవుడ్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దర్శకుడిలాగే నాకూ హాలీవుడ్‌లో కనీసం ఒక్క సినిమా అయినా దర్శకత్వం వహించాలని బలమైన కోరిక ఉంది. అక్కడ ఉన్న పక్కా వర్క్ కల్చర్, ప్రొడక్షన్ స్ట్రక్చర్ , వృత్తిపరమైన ప్రమాణాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హాలీవుడ్ నిర్మాణ శైలిలో పనిచేయడం నాకు ఎంతో ఇష్టం. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్థాయిలో విజయం సాధించిన తర్వాత హాలీవుడ్ నుంచి నాకు అనేక ఆఫర్లు వచ్చాయి. వాటిలో కొన్ని అవకాశాలు ఇప్పటికీ ఓపెన్‌గానే ఉన్నాయి. అయితే, ఆ సమయంలోనే నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను. నా మైండ్ ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టలేదు. ఒక పనిని పూర్తిగా ముగించుకున్న తర్వాతే మరో దాని గురించి ఆలోచించడం నా నైజం. అందుకే ఆ ఆఫర్లను అప్పట్లో పక్కన పెట్టాల్సి వచ్చింది” అని రాజమౌళి వివరించారు.

ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘వారణాసి’ పైనే రాజమౌళి పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రధాన షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తయిందని, కేవలం మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ఆయన వెల్లడించారు. భారతీయ ఇతిహాసాలు, అద్భుతమైన భావోద్వేగాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘వారణాసి’ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే హాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించే అవకాశం ఉందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu: ఓటింగ్‏లో రోహిత్ ఢమాల్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..!

Loading...
Unable to load recommendations.
Follow Us