
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిచుకున్నారు. స్టార్ హీరోల కెరీర్ లో ఎన్నో హిట్స్ అందించిన పూరి.. అలాగే చాలా మంది కథానాయికలను వెండితెరకు పరిచయం చేశారు. అయితే ఆయన సినీ ప్రయాణంలో ఓ హీరోయిన్ ద్వారా జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సినిమా ఛాన్స్ కోసం ఫోటోస్ అడగ్గా.. ఆధార్ కోసం దాచిన పాస్ ఫోటో ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు. తనే అనుష్క శెట్టి. అనుష్కను మొదటిసారి తాను బాంబేలో ఆడిషన్ చేసిన సందర్భాన్ని పూరి గుర్తుచేసుకున్నారు. ఒక చిన్న గదిలో, చాలా భయపడుతూ, సిగ్గుపడుతూ ఆడిషన్ ఇచ్చిన కన్నడ అమ్మాయి ఆమె అని వివరించారు. అప్పట్లో నాగార్జున గారు తనతో మాట్లాడుతూ, “పూరి గారు మనకు హీరోయిన్ కావాలి, ఒకసారి చూడండి” అని చెప్పి, కొన్ని ఫోటోలు పంపించారని తెలిపారు. ఆ ఫోటోలలో, స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్న ఒక ఫోటో చూసి, “ఈ అమ్మాయి హీరోయిన్ అవుతుంది” అని తాను భావించి ఆమెను సూపర్ చిత్రం కోసం ఎంపిక చేశానని వెల్లడించారు.
అయితే సూపర్ సినిమా కోసం ఫోటోస్ అడగ్గా.. తన దగ్గర పర్సులో ఆధార్ కోసం దాచుకున్న చిన్న పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తనకు చూపించిందని గుర్తు చేసుకున్నారు. యాక్టింగ్ వచ్చా అంటే తెలీదు అని చెప్పిందని గుర్తు చేసుకున్నారు. అలాంటి అమాయకమైన అమ్మాయిని తాను సూపర్ సినిమాతో పరిచయం చేశానని… కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఆమె దాదాపు 30-40 మంది ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారని, వారిలో రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడు ఉన్నారని పేర్కొన్నారు. తాను అనుష్కలో మొట్టమొదట చూసిన లక్షణం, ఎంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ఆమెలో అదే సిగ్గు, అదే భయం, అదే విధమైన డౌన్ టు ఎర్త్ స్వభావం ఏ మాత్రం మారలేదని పూరి అన్నారు.
అనుష్క లాంటి మంచి అమ్మాయిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసినందుకు నాగార్జున గారికి పూరి జగన్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అనుష్క అటు సినిమాలకు, ఇటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..
Anushka Shetty
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..