
దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఇటీవల అలితో సరదాగా కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, విజయాలు, మరియు కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ఆయన సినిమాల వెనుక ఉన్న ఆలోచనలు, మ్యూజిక్ ప్రాధాన్యత, సెంటిమెంట్లపై తన వైఖరిని వివరించారు. అల్లరి ప్రియుడు సినిమా గురించి మాట్లాడుతూ, అప్పటికే యాక్షన్ హీరోగా పేరున్న రాజశేఖర్‌ను ప్రేమకథా చిత్రంలో హీరోగా చూపించడంపై మొదట్లో సందేహాలు వ్యక్తమయ్యాయని రాఘవేంద్రరావు తెలిపారు. “రాజశేఖర్ డాన్స్ చేయడం ఏంటి, అతనికి ఏదో మైండ్‌లో చిప్పు పోయినట్టు ఉంది” అనే మాటలు వినిపించాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే, రాజశేఖర్ చేయగలనని నమ్మిన విషయాలనే తాను చేయించానని, అనవసరంగా కష్టమైనవి చెప్పలేదని పేర్కొన్నారు. సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ నుంచి “రాజశేఖర్ డ్రెస్సింగ్, స్టెప్పులు, పాటలు ఏమిటి? మీకు మొత్తం దుకాణం మూసేయాల్సిందే” అని ప్రతికూల స్పందన వచ్చిందని చెప్పారు. దీనితో మనసులో బాధపడిన రాఘవేంద్రరావు, మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సమయంలో ప్రతిరోజు పూజలో ఆ సినిమా విజయం కోసమే దేవుడిని ప్రార్థించేవారని వెల్లడించారు. రెండో వారం నుండి సినిమా అద్భుత విజయాన్ని సాధించి 25 వారాలు ఆడిందని, అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటరే ఫోన్ చేసి అభినందించారని తెలిపారు. ఒక నటుడిని ఒకే తరహా పాత్రలకే పరిమితం చేయకుండా, “యాంగ్రీ యంగ్ మ్యాన్‌గానే ఎందుకు ఉండాలి? లవర్ బాయ్‌గా ఎందుకు ఉండకూడదు?” అనే ఆలోచనతో రాజశేఖర్‌ను కొత్తగా చూపించారని వివరించారు.
కె. రాఘవేంద్రరావు తన కెరీర్‌లో ఎదురైన ఒక ముఖ్యమైన సంఘటనను పంచుకున్నారు. అప్పట్లో మద్రాస్‌లో ఒక హీరోయిన్‌ను “ఐరన్ లెగ్” అని, ఆమె ఉంటే సినిమాలు ఫ్లాప్ అవుతాయని అనేవారని అలీ ప్రస్తావించగా, అలాంటి నటిని తీసుకుని “గోల్డెన్ లెగ్”గా ఎలా మార్చారని ప్రశ్నించారు. దీనికి రాఘవేంద్రరావు సెంటిమెంట్లను నమ్మనని, మంచి రోజు చూసుకోవడం తప్ప, ఎవరినీ ఐరన్ లెగ్ అని భావించనని సమాధానం ఇచ్చారు. ఆమె మరెవరో కాదు రమ్యకృష్ణ. ఆ హీరోయిన్ తల్లిదండ్రులు బాధపడుతున్న సమయంలో, అల్లుడు గారు సినిమాలో ఆమెకు మూగ క్యారెక్టర్ ఇచ్చానని, ముద్దు ముద్దు పూవులో అనే ఒక్క పాటతోనే ఆమెను పెద్ద స్టార్‌ను చేశానని వివరించారు. “ఒక మూగ అమ్మాయి పాట హిట్ అవ్వాలి, ఆ ఎక్స్‌ప్రెషన్ తెలియాలి” అనే ఆలోచనతో ఆ పాటను చిత్రీకరించినట్లు తెలిపారు. అల్లరి మొగుడు విజయోత్సవంలో ఆ హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంటూ, తనను “ఐరన్ లెగ్” అని పిలిచిన వారికి ఈ విజయం సమాధానం అని భావించిందని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. అప్పటికి 14 సినిమాలు పరాజయం పాలైనప్పటికీ, “ఎవరైతే నిన్ను కాదన్నారో, వాళ్ళందరూ నిన్ను అడిగే రోజు వస్తుంది” అని ఆమెకు ధైర్యం చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
కీరవాణితో తన కాంబినేషన్‌లో వచ్చిన పాటలు ఎప్పుడూ మ్యూజికల్‌గా బాగుంటాయని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. రోజూవే పూవ్వా వంటి పాటలను సిట్యుయేషన్ చెప్పగానే కీరవాణి పల్లవి ఇచ్చేవారని తెలిపారు. తన పాటలు హిట్ అవుతాయో లేదో తెలుసుకోవడానికి ఇంట్లో పిల్లలను కూర్చోబెట్టి పాడేవారట. పండు పండు పండు ఎర్ర పండు, రోజూ రోజూ రోజూవే పూవ్వా వంటి నర్సరీ రైమ్ లాంటి పాటలను పిల్లలు “నాన్‌సెన్స్” అన్నారంటే, గ్యారంటీగా అవి హిట్ అవుతాయని తన సెంటిమెంట్‌ను పంచుకున్నారు. బంగారు బాతు గుడ్డు వంటి పాటలు కూడా ఈ కోవలోకే వస్తాయని, చిరంజీవి గారి బంగారు కోడిపెట్ట వంటి పాటలు కూడా నర్సరీ వర్డ్స్‌తో పెద్ద హిట్టయ్యాయని ఆయన వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..
Ragavendra Rao, Ramya Krish
ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..