Rowdy Boys: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. రౌడీ బాయ్స్‌ అంటూ వస్తోన్న ఆశిష్‌. సినిమా టీజర్‌ చూశారా.?

| Edited By: Ravi Kiran

Sep 21, 2021 | 6:59 AM

Rowdy Boys Teaser: సినీ రంగంలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే ఎక్కువగా హీరోల వారసులు సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. కానీ తాజాగా ఇతర విభాగాలకు చెందిన..

Rowdy Boys: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. రౌడీ బాయ్స్‌ అంటూ వస్తోన్న ఆశిష్‌. సినిమా టీజర్‌ చూశారా.?
Follow us on

Rowdy Boys Teaser: సినీ రంగంలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమైన విషయం. అయితే ఎక్కువగా హీరోల వారసులు సినిమా రంగంలోకి ప్రవేశిస్తుంటారు. కానీ తాజాగా ఇతర విభాగాలకు చెందిన వారి వారసులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో దిల్‌ రాజు ఒకరు. దిల్‌రాజు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతోన్న ఆయన కుటుంబానికి చెందిన ఎవరూ సినీ రంగ ప్రవేశం చేయలేదు. అయితే తొలిసారి ఈ బడా నిర్మాత కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి హీరోగా పరిచయమవుతున్నాడు.

దిల్‌రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్‌ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతను నటిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. ఇందులో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేసింది. టీజర్‌ను గమనిస్తే సినిమా కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథలా అనిపిస్తోంది. అమ్మాయి కోసం రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ అనే ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో ఇప్పటికే ఇలాంటి కథాంశంతో సినిమాలు వచ్చినప్పటికీ.. దర్శకుడు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నట్లు టీజర్‌ను గమనిస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం వహిస్తుండడం విశేషం. హీరో ఆశిష్‌ తొలి సినిమాలోనే మంచి నటనను కనబరినట్లు టీజర్‌లో తెలుస్తోంది. మరి దిల్‌ రాజు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వస్తున్న తొలి హీరో ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.

Also Read: KKR vs RCB: కోహ్లీ సేనకు ఏమైంది..? భారీ అంచనాలను తుస్సుమనిపించారు.. ఈ సీజన్‌లోనే ఆర్‌సీబీ ఘోర పరాజయం

Samantha: అన్ని పుకార్లను సమంత ఒక్క ట్వీట్‌తో పటా పంచలు చేసిందా.! ఇంతకీ సామ్‌ చేసిన ఆ ట్వీట్ ఏంటో తెలుసా.?

Tirumala: సర్వదర్శనం టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు.. మంగళవారం ఉదయం 6 గంటలకు నుంచి టికెట్లు..