Viral Photo: ఈ ఫోటోలోని యంగ్ హీరో అమ్మాయిలకు లవర్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ...

Viral Photo: ఈ ఫోటోలోని యంగ్ హీరో అమ్మాయిలకు లవర్ బాయ్.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Hero

Updated on: Mar 30, 2022 | 12:54 PM

ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ప్రతీ రోజూ తాము చేసే దినచర్యను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. హీరోహీరోయిన్లు తమ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ కావడానికి సోషల్ మీడియా ఓ వారధిలా నిలిచింది. ఈ తరుణంలో తమకిష్టమైన సెలబ్రిటీల ఫోటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తే.. వాటిని వెంటనే అభిమానులు వైరల్ చేసేస్తుంటారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ క్రేజీ హీరో ఫోటో ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని స్టార్.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో. 20 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కున్నాడు. వరుసపెట్టి 12 ఫ్లాప్స్ చవిచూసినా.. అధైర్యపడకుండా అభిమానులను తన సినిమాలతో అలరిస్తూ వచ్చాడు.. ఫ్యాన్స్‌ గుండెల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవల ఈ హీరో చేసిన సినిమా డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా రిలీజైంది. ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది.

అతడెవరో కాదు యువ హీరో నితిన్.. 2002లో ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమైన నితిన్ తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘దిల్’, ‘సై’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకోగా.. ఆ తర్వాత అతడు చేసిన సినిమాలేవి కూడా ఆశించదగ్గ విజయాలు అందుకోలేదు. అనంతరం ‘ఇష్క్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ‘గుండె జారి గల్లంతయింది’, ‘హార్ట్ ఎటాక్’, ‘చిన్నదానా నీకోసం’, ‘అఆ’, ‘భీష్మా’, ‘రంగ్ దే’, ‘మాస్ట్రో’ సినిమాలతో అభిమానులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Also Read:

Viral Video: ఏటీఎం నుంచి వింత శబ్దాలు.. భయంతో డోర్ ఓపెన్ చేయగా కళ్లు చెదిరే సీన్..

Viral Photo: ఈ ఫోటోలో మీకేం కనిపిస్తోంది.. మొదటిగా చూసేది మీ సీక్రెట్ చెప్పేస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us