Zakir Hussain: పారితోషికంగా 5 రూపాయలే! డబ్బు కంటే కళకు ఎక్కువ విలువిచ్చిన జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులివే

|

Dec 16, 2024 | 9:05 AM

ప్రముఖ తబలా విద్వాంసులు జాకీర్ హుస్సేన్ మరణంతో సంగీత ప్రపంచం మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తబలా వాయిద్య కారుడికి నివాళులు అర్పిస్తున్నారు.

Zakir Hussain: పారితోషికంగా 5 రూపాయలే! డబ్బు కంటే కళకు ఎక్కువ విలువిచ్చిన జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులివే
Zakir Hussain
Follow us on

తబలా మాస్ట్రో జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అమెరికాలో ఉంటోన్న ఆదివారం (డిసెంబర్ 15) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో శాన్ ఫ్రాన్కిస్కోలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో రాత్రి జాకీర్ హుస్సేన్ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో జాకీర్ హుస్సేన్ పారితోషికం, ఆస్తులపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని గురించి ఇక్కడ చూద్దాం. జాకీర్ హుస్సేన్ 1951లో జన్మించారు. తండ్రి పేరు జాకీర్ ఉస్తాద్ అల్లా రఖా. చిన్నవయస్సులోనే తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.. కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. విదేశాల్లో కూడా కచరీలు నిర్వహించాడు. విదేశాల్లో తన మొదటి కచేరీకి జాకీర్ హుస్సేన్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? కేవలం 5 రూపాయలు మాత్రమే. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ జాకీర్ హుస్సేన్ అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. ఒక్కో షోకి 5 నుంచి 10 లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు. కాగా జాకీర్ హుస్సేన్ డబ్బు కంటే కళకు ఎక్కువ విలువ ఇచ్చారు. అందుకే ఆయన పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదని తెలుస్తోంది. జాకీర్ హుస్సేన్ మొత్తం ఆస్తులు 8 నుంచి 10 కోట్ల రూపాయల దాకా మాత్రమే ఉంటుందని సమాచారం.

జాకీర్ హుస్సేన్ గత కొంతకాలంగా బయట కనిపించడం లేదు. దీనికి కారణం అనారోగ్యమేనని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన హఠన్మారణంతో సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గుర్తింపుగా 1998లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు జాకీర్ హుస్సేన్. అలాగే గ్రామీ అవార్డును కూడా గెలుచుకున్నారు.

జాకీర్ హుస్సేన్ తో కమల్ హాసన్.

జాకీర్ హుస్సేన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన మృతితో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. జాకీర్‌ హుస్సేన్‌ మరణంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కమల్ హాసన్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తబలా విద్వాంసుడికి నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.