అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు.

అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..
Actress

Updated on: Jul 29, 2026 | 9:56 AM

సినిమా ఇండస్ట్రీలో విడాకుల హవ పెరిగిపోతుంది. సీని సెలబ్రెటీలు ఈ మధ్యకాలంలో విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ సెలబ్రెటీలు విడిపోయారు. కొందరు దూరంగా ఉంటున్నారు. ఏడాది క్రితం పెళ్ళైన వారు మాత్రమే కాదు 17-18ఏళ్ల క్రితం వివాహం అయినా వారు కూడా విడిపోతున్నట్టు అనౌన్స్ చేస్తున్నారు. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో చెప్పడం కష్టంగా మారిపోతుంది. స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా బ్రేకప్స్‌తో, రిలేషన్ షిప్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు మరోస్టార్ కపుల్ కూడా విడిపోతున్నారని  వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి కేవలం నాలుగు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. త్వరలోనే విడిపోయే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకూ ఆ జంట ఎవరంటే..

ఇదికూడా చదవండి : అమ్మబాబోయ్.. ఇదెక్కడి మార్పు రా మావ..!! ఈ చిన్నది ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్

సినీ ఇండస్ట్రీలో హీరోల, హీరోయిన్స్ మాత్రమే కాదు సింగర్స్ కూడా చాలా పాపులర్. ఎంతో మంది సింగర్స్ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ కు మించి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. వారిలో ఈ రాప్ సింగర్ ఒకడు. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి పాపులర్ అయ్యాడు. అతనే ర్యాప్ సింగర్ బాద్‌షా.. ఈ పేరు తెలుగు పేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈయన చాలా ఫెమస్.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు

హిందీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఆయన. సింగర్ బాద్‌షా పలు టీవీషోల్లో జడ్జ్ గాను వ్యవహరిస్తున్నాడు. కాగా ఇటీవలే బాద్‌షా ఇషా రిఖి వివాహం చేసుకున్నాడు. నాలుగు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. బాద్‌షాకు ఇది రెండో వివాహం. గతంలో జాస్మిన్ మసీహ్‌ను వివాహం చేసుకున్న ఆయన, 2020లో ఆమెతో విడిపోయారు. కాగా ఈ ఏడాది మార్చ్‌లో బాద్‌షా, ఇషా రిఖి వివాహం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. తన భర్త అధికారం, ఆధిపత్యం చూసి భయపడి ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై దేనికీ భయపడేది లేదని ఇషా రిఖి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. నా మౌనం నా అంగీకారం కాదు, కేవలం బతికేందుకు చేసిన ప్రయత్నం మాత్రమే.. ఇక భయపడేది లేదు అంటూ ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ఇషా రిఖికి సపోర్ట్ గా కొందరు సెలబ్రెటీలు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి :ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us