Katrina Kaif: కత్రినా దంపతులకు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్‌.. విచారణలో ఏం తేలిందంటే?

|

Jul 25, 2022 | 3:14 PM

Katrina Kaif- Vicky: బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ కత్రినా కైఫ్ (Katrina Kaif)‌- విక్కీ కౌశల్‌ను (Vicky Kaushal) చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మన్వీందర్‌ సింగ్‌ (Manvinder Singh) గా గుర్తించారు.

Katrina Kaif: కత్రినా దంపతులకు బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్‌.. విచారణలో ఏం తేలిందంటే?
Katrina Kaif And Vicky Kaus
Follow us on

Katrina Kaif- Vicky: బాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ కత్రినా కైఫ్ (Katrina Kaif)‌- విక్కీ కౌశల్‌ను (Vicky Kaushal) చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని మన్వీందర్‌ సింగ్‌ (Manvinder Singh) గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్‌ సింగ్‌కు కత్రినా అంటే ఎంతో అభిమానం. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని కలలు కన్నాడు. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతని ఆశలు కాస్తా అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్‌ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరంపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు ముంబయ్‌లోని శాంతాక్రూజ్‌ పోలీసులను ఆశ్రయించారు. దీనిని సీరియస్‌ గా తీసుకున్న పోలీసులు.. సెక్షన్ 506(2), 354(డి) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద మన్వీందర్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడి ఇన్‌స్టాగ్రామ్‌ అంతటా కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్‌ హీరోయిన్ల ఎడిటెడ్‌ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్‌ చేసి ఓ వీడియోను కూడా షేర్‌ చేశాడు.

కాగా నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలిన కత్రినా కైఫ్‌- విశాల్‌ గతేడాది పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న టైగర్‌-3లో క్యాట్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. గోవింద్‌ నామ్‌ మేరా, డుంకీ చిత్రాలతో విక్కీ బిజీగా ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..