Katrina Kaif : బ్యాడ్మింటన్ ఆడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ .. కత్రినా కైఫ్ ఫన్నీ వీడియో వైరల్

|

Feb 07, 2021 | 7:04 PM

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఈ అమ్మడు..

Katrina Kaif : బ్యాడ్మింటన్ ఆడిన బాలీవుడ్ ముద్దుగుమ్మ .. కత్రినా కైఫ్ ఫన్నీ వీడియో వైరల్
Follow us on

Katrina Kaif : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కత్రినా కైఫ్ బ్యాడ్మింటన్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం ఫోన్ భూత్ చిత్రంలో నటిస్తోంది కత్రినా. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సిద్దాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్‌, కత్రినా కాంబోలో ఈ సినిమా రానుంది. కాగా ఈ ముగ్గురు బ్యాడ్మింటన్ ఆడుతూ సరదాగా గడిపారు. ఇక గేమ్ మధ్యలో చిన్న చిన్న స్టెప్స్ కూడా వేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరి చక్కర్లు కొడుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rhea Chakraborty : రియా చక్రవర్తితో టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సంప్రదింపులు.. త్వరలో తెలుగులో సినిమా..?