Kareena Kapoor second baby : పండంటి బిడ్డకు జన్మనించిన బాలీవుడ్ బ్యూటీ.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు బాబు..

కొద్ది రోజుల క్రితం తాను ప్ర‌గ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి అభిమానుల‌ని ఆనందింప‌జేసిన క‌రీనా కపూర్ , ఈ స‌మ‌యంలోను షూటింగ్స్‌కు హాజ‌ర‌వుతూ మ‌ధ్య మ‌ధ్య‌లో యోగా‌సనాలు చేస్తుంది.

Kareena Kapoor second baby : పండంటి బిడ్డకు జన్మనించిన బాలీవుడ్ బ్యూటీ.. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు బాబు..

Edited By:

Updated on: Feb 21, 2021 | 9:00 PM

Kareena Kapoor new baby :  కొద్ది రోజుల క్రితం తాను ప్ర‌గ్నెంట్ అంటూ సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి అభిమానుల‌ని ఆనందింప‌జేసిన క‌రీనా కపూర్ , ఆ స‌మ‌యంలోను షూటింగ్స్‌కు హాజ‌ర‌వుతూ మ‌ధ్య మ‌ధ్య‌లో యోగా‌సనాలు చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా తాజాగా కరీనా బిడ్డకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనా కపూర్ అడ్మిట్ అయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 21)న కరీనా కపూర్ డెలివరీ అయ్యారని తెలుస్తుంది. నటుడు సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ 2012లో వివాహం చేసుకున్నారు. సైఫ్ కి ఇది రెండో వివాహం కావడం విశేషం. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లకు మొదటి సంతానంగా 2016లో తైమూర్ అలీ ఖాన్ జన్మించాడు. ప్రస్తుతం కరీనా కపూర్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. నటుడు అమీర్ ఖాన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక కరీనా కపూర్ సెకండ్ చైల్డ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sumanth About Allu Arjun Movie Video: బన్నీ కాకుండా నేను చేస్తే అట్టర్ ఫ్లాప్‌ అయ్యేది.

Sunil Movie : ఆసక్తి రేపుతున్న సునీల్ నయా మూవీ పోస్టర్.. క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌తో రానున్న హీరో కం విలన్…