Kangana Twitter: కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతాకు బ్రేక్.. శ్వాశ్వతంగా క్లోజ్ చేస్తూ నిర్ణయం..

|

May 04, 2021 | 3:25 PM

Kangana Twitter account: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతా శ్వాశ్వతంగా క్లోజ్ అయ్యింది. బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా ఖాతాను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా...

Kangana Twitter: కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతాకు బ్రేక్.. శ్వాశ్వతంగా క్లోజ్ చేస్తూ నిర్ణయం..
Follow us on

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ట్విటర్ ఖాతా శ్వాశ్వతంగా క్లోజ్ అయ్యింది. బాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా ఖాతాను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ వెల్లడించింది. వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్‌ చేయడం ద్వారా ట్విటర్‌ నియమ, నిబంధనలను కంగనా బ్రేక్ చేస్తున్నారంటూ పేర్కొంది. విద్వేషపూరిత, అసభ్య ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇటీవల పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కంగన చేసిన ట్వీట్‌ వివాదాస్పదమైంది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని కించపరిచేలా ఆమె ట్వీట్‌ ఉండటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింస పెచ్చరిల్లే అవకాశం ఉందని జర్నలిస్ట్‌, రాజకీయనాయకురాలు స్వపన్‌ దాస్‌గుప్త చేసిన ట్వీట్‌కు కంగనా తనదైన తరహాలో స్పందించారు. దీంతో కంగనా ట్విటర్‌ ఖాతాను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ అధికారి ప్రతినిధి వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి.. PM Suraksha Bima Yojana: కేవలం 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు బీమా పొందండి… ఆ వివరాలు ఇలా తెలుసుకోండి..

దేశంలో మూడో రోజూ స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు, ఆసుపత్రుల్లో మారని పరిస్థితులు, ఆక్సిజన్ సరఫరాలో జాప్యం