Janhvi Kapoor: లైఫ్‌లో జరిగిన వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్న జాన్వీ.. బాయ్‌ ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లిన టైంలో

|

Jan 17, 2021 | 8:36 PM

టాప్‌ స్టార్స్ తమ పర్సనల్‌ రిలేషన్స్, ఎఫైర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ బాలీవుడ్‌ స్టార్ వారసురాలు జాన్వీ కపూర్‌ మాత్రం సంథింగ్ డిఫరెంట్‌.

Janhvi Kapoor: లైఫ్‌లో జరిగిన వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్న జాన్వీ.. బాయ్‌ ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లిన టైంలో
 దఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. అలాగే జాన్వీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా  ఉంటుంది. 
Follow us on

Janhvi Kapoor:  టాప్‌ స్టార్స్ తమ పర్సనల్‌ రిలేషన్స్, ఎఫైర్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కానీ బాలీవుడ్‌ స్టార్ వారసురాలు జాన్వీ కపూర్‌ మాత్రం సంథింగ్ డిఫరెంట్‌. తన లైఫ్‌లో జరిగిన ఓ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు జాన్వీ.. అది కూడా తన బాయ్‌ ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లినటైంలో జరిగిన ఘటన గురించి ఓపెన్‌గా చెప్పి షాక్‌ ఇచ్చారు జాన్వీ.

ఫిలిం ఎంట్రీకి ముందుకు లాస్‌ ఏంజెల్స్‌లో చదువుకున్నారు జాన్వీ.. ఆ టైంలో తన బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ఓ సారి డేట్‌కు వెళ్లానని చెప్పారు. ఆ టైంలో తన బాయ్‌ ఫ్రెండ్‌ తనను వేదించాడని, తప్పుడు ప్రపోజల్స్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎలాగోలా అక్కడి నుంచి బయటపడిన జాన్వీ ఇక జీవితంలో అలాంటి తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యారట.

ప్రజెంట్ ఈ బ్యూటీ బాలీవుడ్‌ చాక్లెట్‌ బాయ్‌ కార్తీక్‌ ఆర్యన్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. సెలబ్రిటీ పార్టీస్‌తో పాటు హాలీడే ట్రిప్స్‌లోనూ కార్తీక్‌, జాన్వీలు కలిసే కనిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ డైరెక్ట్ చేస్తున్న ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ సినిమాలో నటిస్తున్నారు జాన్వీ కపూర్‌.

Also Read:

Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Vakeel Saab Movie Update: ‘వకీల్ సాబ్’‌ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలేనట..!

Ainanu Poi Ravale Hastinaku: ఎన్టీఆర్ సినిమా టైటిల్‌పై త్రివిక్రమ్ ఓ క్లారిటీకి వచ్చేశాడా..? ఫిల్మ్ సర్కిట్ టాక్ ఏంటి..?