Ainanu Poi Ravale Hastinaku: ఎన్టీఆర్ సినిమా టైటిల్‌పై త్రివిక్రమ్ ఓ క్లారిటీకి వచ్చేశాడా..? ఫిల్మ్ సర్కిట్ టాక్ ఏంటి..?

ట్రిపులార్‌ షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్స్ మూవీని ఎప్పుడో కన్ఫార్మ్‌ చేశారు. మాటల మాంత్రికుడితో యంగ్‌ టైగర్‌ సినిమా...ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి...

Ainanu Poi Ravale Hastinaku: ఎన్టీఆర్ సినిమా టైటిల్‌పై త్రివిక్రమ్ ఓ క్లారిటీకి వచ్చేశాడా..? ఫిల్మ్ సర్కిట్ టాక్ ఏంటి..?
Follow us

|

Updated on: Jan 17, 2021 | 6:46 PM

ట్రిపులార్‌ షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్, నెక్ట్స్ మూవీని ఎప్పుడో కన్ఫార్మ్‌ చేశారు. మాటల మాంత్రికుడితో యంగ్‌ టైగర్‌ సినిమా…ఈ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి మూవీకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైర్‌ అయ్యాయి. అయితే తాజాగా ఆ న్యూస్‌కు మరింత బలం చేకూర్చే అప్‌డేట్ ఒకటి ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది.

పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారన్న న్యూస్‌ గతంలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. అంతగా జనాల్లోకి వెళ్లిన టైటిల్‌ని మార్చడం త్రివిక్రమ్‌కి నచ్చలేదట. పైగా సౌండింగ్‌ బావుండటంతో మూవీకి అదే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారట. సో ఇక టైటిల్‌ని డిజైన్‌లో చూసుకోవడమే తరువాయి అని ఫీలవుతున్నారు యంగ్‌ టైగర్‌ ఫ్యాన్స్.

అరవింద సమేత లాంటి బిగ్ హిట్ తరువాత ఎన్టీఆర్‌ త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అన్న అనౌన్స్‌మెంట్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అంతేకాదు సినిమా కంటెంట్‌ నుంచి టైటిల్‌ వరకు అన్ని విషయాల్లో ఎవరి అంచనాలకు తగ్గట్టు వాళ్లు గాసిప్స్ మొదలు పెట్టారు. హీరోయిన్ల గురించి కూడా ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న ఈ విషయాల గురించి చిత్రయూనిట్‌ క్లారిటీ ఇస్తారా..? లేక ఈ రూమర్లను కూడా సైలెంట్‌గా ఎంజాయ్ చేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Also Read :

Ram Gopal Varma: సర్కార్ సిరీస్‌లో మరో సినిమా… క్లారిటీ ఇచ్చేసిన ఆర్జీవీ.. కుండబద్దలు కొట్టేశారుగా..!

Vakeel Saab Movie Update: ‘వకీల్ సాబ్’‌ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌కు పూనకాలేనట..!