Ranveer Singh: రణవీర్‌కు ’83’ ఎఫెక్ట్.. మూలన పడిన మరో బయోపిక్.. బాక్సాఫీస్ ఫలితాలే కారణమా?

|

Jan 05, 2022 | 9:33 AM

ప్రస్తుతం 'మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌'గా ఉన్న రణవీర్ సింగ్ చాలా స్క్రిప్ట్‌లతో, ముఖ్యంగా బయోపిక్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 83 సినిమాలో రణవీర్ అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు.

Ranveer Singh: రణవీర్‌కు 83 ఎఫెక్ట్.. మూలన పడిన మరో బయోపిక్.. బాక్సాఫీస్ ఫలితాలే కారణమా?
Ranveer Singh Become Kapil Dev In Movie 83
Follow us on

Ranveer Singh: ప్రస్తుతం ‘మ్యాన్ ఆఫ్ ది మూమెంట్‌’గా ఉన్న రణవీర్ సింగ్ చాలా స్క్రిప్ట్‌లతో, ముఖ్యంగా బయోపిక్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 83 సినిమాలో రణవీర్ అద్భుతమైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో రణ్‌వీర్ తర్వాత ప్రాజెక్ట్ సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. కబీర్ ఖాన్, సాజిద్ నదియాడ్‌వాలాతో కలిసి రణవీర్ మరో బయోపిక్‌కు ప్లాన్ చేశారు. కానీ, ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పక్కనపడ్డట్లు తెలస్తోంది.

రణవీర్ ఈ సినిమాలో పారాప్లెజిక్ స్విమ్మర్ పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ‘తాను 5 బయోపిక్‌ల కోసం చర్చలు జరుపుతున్నానని, వాటిలో మూడు క్రీడాకారుల బయోపిక్‌లు ఉన్నాయని’ రణవీర్ ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు.

’83 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. ‘ పుష్ప ‘, ‘ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ వంటి ఇతర చిత్రాలు ఒమిక్రాన్ వ్యాప్తి చెందినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ సంఖ్యలో వసూలు చేశాయి. రణ్‌వీర్, దీపికా పదుకొణె నటించిన 83 చిత్రం పెద్దగా సినీ ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. దీంతోనే తన తదుపరి సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రణ్‌వీర్ ప్రస్తుతం ‘సర్కస్ ‘, ‘జయేష్‌భాయ్ జోర్దార్’, ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also Read: Perni Nani vs RGV: వర్మ ప్రశ్నలకు పేర్ని నాని కౌంటర్ ఎటాక్.. ఏ చట్టం చెప్పిందంటూ..

Anupama Parameswaran: లవ్ బ్రేకప్ గురించి హీరోయిన్ ఓపెన్ కామెంట్స్.. కానీ.. ప్రేమను గుర్తుచేసుకోనంటూ..