Anurag Kashyap: ఇకపై నాతో మాట్లాడలంటే లక్షల ఫీజు కట్టాల్సిందే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..

|

Mar 23, 2024 | 6:57 PM

ఇకపై తనతో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాలని.. ఉచితంగా సలహాలిస్తూ ఉండటానికి తానేమీ స్వచ్ఛంద సంస్థను కాదన్నారు. ఇప్పుడు కొత్తవారికి సాయం చేయడంలో తాను విసిగిపోయానని.. కొత్తగా ఎవరైనా కలవాలి అనుకున్నా.. ఆ సమావేశానికి డబ్బులు వసూలు చేయనున్నానని.. అంతేకాకుండా సినిమా నిర్మాతలు మాట్లాడాలనుకుంటే నిమిషాలు, గంటల ప్రకారం డబ్బులు చెల్లించాలంటూ పోస్ట్ చేశారు.

Anurag Kashyap: ఇకపై నాతో మాట్లాడలంటే లక్షల ఫీజు కట్టాల్సిందే.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
Anurag Kashyap
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యుత్తమ అగ్ర దర్శకులలో అనురాగ్ కశ్యప్ ఒకరు. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. కొన్నాళ్లుగా అనురాగ్ కశ్యప్ నిత్యం వారలలో నిలుస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్‏గా అనేక విషయాలపై స్పందించే అనురాగ్.. ఇప్పుడు చేసిన పోస్ట్ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇకపై తనతో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాలని.. ఉచితంగా సలహాలిస్తూ ఉండటానికి తానేమీ స్వచ్ఛంద సంస్థను కాదన్నారు. ఇప్పుడు కొత్తవారికి సాయం చేయడంలో తాను విసిగిపోయానని.. కొత్తగా ఎవరైనా కలవాలి అనుకున్నా.. ఆ సమావేశానికి డబ్బులు వసూలు చేయనున్నానని.. అంతేకాకుండా సినిమా నిర్మాతలు మాట్లాడాలనుకుంటే నిమిషాలు, గంటల ప్రకారం డబ్బులు చెల్లించాలంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అనురాగ్ చేసిన పోస్ట్ నెట్టింట అత్యంత వేగంగా వైరల్ అవుతుంది.

“చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చి స్టార్‌ యాక్టర్స్‌గా తీర్చిదిద్దాను. కానీ చాలా మంది తక్కువ క్వాలిటీ, మామూలు కమర్షియల్ సినిమాలకే సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీలోని కొత్తవారికి సహాయం చేస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తూ నేను నా సమయాన్ని చాలా వృధా చేశాను. వీటన్నింటితో చాలాసార్లు మధ్యలో ఇరుక్కుపోయాను. ఇప్పటి నుండి నేను తెలివైన మేధావులని భావించే వ్యక్తులతో మాట్లాడుతూ నా సమయాన్ని వృథా చేయకూడదనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీగా ఏ పని చేయను. ప్రతి దానికి ఇప్పుడు ఒక రేటు నిర్ణయిస్తున్నాను. ఎవరైనా నన్ను 10-15 నిమిషాలు కలవాలనుకుంటే రూ. 1 లక్ష చెల్లించాలి. అలాగే అరగంటకు రూ. 2 లక్షలు, 1 గంటకు రూ. 5 లక్షలు వసూలు చేస్తాను. మొత్తం ఒకేసారి చెల్లించాలి.

అలా కాకుండా డబ్బులు ఇవ్వలేని వాళ్లు.. కాల్స్ చేసేవాళ్లు.. టెక్ట్స్ మెసేజ్ చేసేవాళ్లు నాకు దూరంగా ఉండండి.. తక్కువ సమయంలో విజయం సాధించాలని షార్ట్ కట్స్ వెతుక్కుంటూ వచ్చే వాళ్లను చూసి చూసి విసిగిపోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. డబ్బులు చెల్లించి నన్ను కలవండి” అంటూ పోస్ట్ చేశారు అనురాగ్. ప్రస్తుతం ఆయన చేసిన ఇన్ స్టా పోస్ట్ వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.