అండర్ వరల్డ్ డాడ్ దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ తిరిగి సినిమాల్లోకి రానుందా..?

| Edited By: Ravi Kiran

Jul 19, 2021 | 6:19 AM

ఒకప్పుడు ఆమె ఓ ఊపు ఊపిన హీరోయిన్ .. కెరియర్ పీక్ లో ఉండగానే మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు. ఆతర్వాత సినిమాలకు దూరమయ్యారు.

అండర్ వరల్డ్ డాడ్ దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ తిరిగి సినిమాల్లోకి రానుందా..?
Mandakini
Follow us on

ఒకప్పుడు ఆమె ఓ ఊపు ఊపిన హీరోయిన్ .. కెరియర్ పీక్ లో ఉండగానే మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకున్నారు. ఆతర్వాత సినిమాలకు దూరమయ్యారు.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరనేగా ఆలోచిస్తున్నారు. ఆమె బాలీవుడ్ బ్యూటీ మందాకిని. ముంబై అండర్ వరల్డ్ డాడ్ దావూద్ ఇబ్రహీం గురించి చిన్న పిల్లాడిని అడిగిన చెప్తాడు. అప్పట్లో ఈ డాన్ గా హీరోయిన్స్ వెంట కూడా పడ్డారు. మనోడి వలలో పడిన హీరోయిన్స్ అప్పట్లో హాట్ టాపిక్.. ఆ టిపిక్లలో ఒక టాపికే హీరోయిన్ మందాకిని. ఈ బ్యూటీ అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం సినిమాలో విషకన్య గా నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత భార్గవ రాముడు అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలతర్వాత పూర్తిగా టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఆసమయంలోనే బాలీవుడ్ లో ఆఫర్లు మందాకిని తలుపు తట్టాయి.. హిందీలో  ఆమె చేసిన `రామ్ తేరీ గంగా మిలీ` సినిమా సంచలన విజయం సాధించింది. ఆసినిమా మందాకిని కెరీర్ కు చాలా ప్లస్ అయ్యింది. ఆసమయంలోనే దావుద్ లో ఈ అమ్మడు ప్రేమలో పడింది.

అప్పట్లో ఈ ఇద్దరి ఎఫైర్ చాలా చర్చలకు దారితీసింది. కొన్నాళ్ల పాటు దుబాయ్ లో ఇరువురు రహస్యంగా కాపురం పెట్టినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడామె బాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మందాకిని వయసు 53ఏళ్ళు. మంచి స్క్రిప్ట్ దొరికితే మందాకిని కంబ్యాక్ అవ్వడానికి మందాకిని రెడీ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Annapurna: ఆ తప్పు చేశానని అందరూ కలిసి చెట్టుకు కట్టేశారు.. అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan-Soundarya: మోహన్ బాబు సౌందర్యకు నో చెప్పినా .. బతికిఉండేది అంటున్న కార్తీక దీపం డైరెక్టర్

Kamal Haasan : షూటింగ్ రీ స్టార్ట్ చేసిన విశ్వనటుడు.. విలన్ గా మక్కల్ సెల్వన్..