Ranbir Kapoor- Alia Bhatt: ఒక్కటైన ప్రేమ పక్షులు.. ఏడు అడుగులు నడిచిన రణబీర్ – అలియా

| Edited By: Basha Shek

Apr 14, 2022 | 8:05 PM

బాలీవుడ్ లవ్ బర్డ్స్.. రణబీర్ కపూర్(Ranbir Kapoor) - అలియా భట్(Alia Bhatt)ల పెళ్లి కోసం బాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

Ranbir Kapoor- Alia Bhatt: ఒక్కటైన ప్రేమ పక్షులు.. ఏడు అడుగులు నడిచిన రణబీర్ - అలియా
Alia Ranbir Marriage
Follow us on

బాలీవుడ్ లవ్ బర్డ్స్.. రణబీర్ కపూర్(Ranbir Kapoor) – అలియా భట్(Alia Bhatt)ల పెళ్లి కోసం బాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఇద్దరు వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి పెళ్లి అనుకున్న సమయానికి చాలా సింపుల్‌గా అయిపోయింది. అలియా భట్ రణబీర్ కపూర్‌తో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ ఇద్దరి పెళ్లి నేడు మధ్యాహ్నం 3- 3:30 మధ్య జరిగిందని బాలీవుడ్ మీడియా చెప్తుంది. ఇప్పుడు అలియా భట్ అలియా కపూర్‌గా మారింది. ఉదయం నుంచే రణబీర్ ఇంటికి బాలీవుడ్ ప్రముఖులు చేరుకుంటున్నారు. కరీనా కపూర్ తన భర్త సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, ఆదార్ జైన్, రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్, సోదరి రిద్ధిమా కపూర్, వారి కుమార్తె సమర సాహ్ని, మహేష్ భట్, పూజా భట్, సోనీ రజ్దాన్‌లతో పాటు దర్శకులు లవ్ రంజన్, అయాన్ ముఖర్జీ, కరణ్ జోహార్‌తో పాటు, ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ కూడా ఈ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది.

ప్రస్తుతం పెళ్లి శుభకార్యం పూర్తి కావడంతో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంది. దీంతో రణ్‌బీర్‌, అలియా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బెస్ట్ కపుల్ అని పిలుచుకునే అలియా భట్- రణబీర్ కపూర్ ఇప్పుడు మొగుడు . అలియా భట్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్‌ను తన మనస్సులో చాలా కాలం క్రితం వివాహం చేసుకున్నానని చెప్పింది. ఈ ఇద్దరి పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందింది. అలియా భట్ – రణబీర్ కపూర్‌ల మధ్య ప్రేమ వారి మొదటి చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సమయంలో జరిగింది. అప్పటినుంచి ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకు తిరిగ్గడం తో వీరి ప్రేమ వ్యవహారం బయట పడింది. ఇప్పుడు ఈ జంట పెళ్లితో ఒక్కటవ్వడంతో అటు అలియా, ఇటు రణబీర్ ఇంట సంబరాలు మిన్నంటాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్