
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్నటి (నవంబర్ 12న) జరిగిన ఎపిసోడ్ లోదేబ్జానీ తల్లిదండ్రులు హౌస్‌లోకి అడుగుపెట్టారు. కూతురిని కలిసిన సందర్భంలో త్రిగుణ్‌తో బాగా కలిసిమెలిసి ఉండాలని ఆమెకు సూచించారు. నామినేషన్ల సమయంలో బలమైన పాయింట్లు చెప్పాలని, కోపాన్ని తగ్గించుకోవాలని సూచించారు. దీంతో పేరెంట్స్ చెప్పిన సలహాను అర్థం చేసుకున్నానని చెప్పింది. ఈ ఎపిసోడ్‌లో దేబ్జానీ కుటుంబంతో పాటు సుధీర్, రాంప్రసాద్ కుటుంబ సభ్యులు కూడా హౌస్‌లోకి వచ్చారు. అంతకుముందు నరేశ్ సోదరుడు సురేశ్, శ్వేత తండ్రి, సోదరి, వంశీ భార్య, కూతురు ఇంట్లోకి వచ్చారు. ఫ్యామిలీ వీక్ ప్రారంభంలో బిగ్‌బాస్ ‘బీబీ స్కూల్’ టాస్క్ ఇచ్చాడు. ఇందులో నరేశ్ ప్రిన్సిపల్‌గా, దేబ్జానీ తెలుగు టీచర్‌గా వ్యవహరించారు. ఈ వారం ఇంట్లోకి వచ్చిన వారంతా హౌస్‌మేట్స్‌కు ఆటకు సంబంధించిన సూచనలు ఇస్తున్నారు.
దేబ్జానీ తండ్రి నరేశ్‌తో సరదాగా గడపడం ఎపిసోడ్‌లో నవ్వులు పూయించింది. కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు హౌస్‌మేట్స్ భావోద్వేగానికి ఎమోషనల్ అవుతున్నారు. శ్వేత తన తండ్రిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వంశీ తన కూతురికి స్వయంగా వండి పెట్టాడు. ఈ వారం ఇంట్లోకి వచ్చిన చాలా మంది త్రిగుణ్‌ను ప్రశంసించారు. శ్వేత తండ్రి అతడిని ‘గేమ్ ఛేంజర్’ అని మెచ్చుకున్నారు. హౌస్ లో గొడవలు జరిగిన తర్వాత కూడా హౌస్‌మేట్స్‌తో సాధారణంగా కలిసిపోయే అతడి తీరును ఆయన అభినందించారు. వంశీ భార్య కూడా తన కుటుంబానికి అండగా నిలిచినందుకు త్రిగుణ్‌కు ధన్యవాదాలు చెప్పింది.
ఇక ఐరన్ చేసుకుని స్టీమర్ అలాగే వదిలేశాడు.. ఇలాంటి బాధ్యత ఉన్న వాడిని మీరు కెప్టెన్ చేశారు.. మిమ్మల్ని ఏమనాలి అంటూ నరేష్ ను అడిగాడు ముకేష్. దీంతో త్రిగుణ్ వచ్చి ఎప్పటిలాగే కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో త్రిగుణ్, ముకేష్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తుంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ వారంలో విన్నర్ ఎవరు అనే విషయాన్ని హింట్స్ ఇస్తూ వెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..