Bigboss: కత్తితో పొడుచుకోబోయిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. నమ్మినవారే మోసం చేశారని గాయపర్చుకునే యత్నం

|

Nov 10, 2021 | 8:44 PM

బుల్లితెర ప్రేక్షకులను అలరించే 'బిగ్‌బాస్‌' టీవీ షోలు అప్పుడప్పుడు వివాదాల్లో కూడా నిలుస్తుంటాయి. ముఖ్యంగా హైస్‌లోని కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం...

Bigboss: కత్తితో పొడుచుకోబోయిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. నమ్మినవారే మోసం చేశారని గాయపర్చుకునే యత్నం
Follow us on

బుల్లితెర ప్రేక్షకులను అలరించే ‘బిగ్‌బాస్‌’ టీవీ షోలు అప్పుడప్పుడు వివాదాల్లో కూడా నిలుస్తుంటాయి. ముఖ్యంగా హైస్‌లోని కంటెస్టెంట్లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఘర్షణలకు దిగడం చేస్తుంటారు. కొన్నిసార్లు ఈ గొడవలు శ్రుతిమించిపోతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి హిందీ బిగ్‌బాస్‌ హౌస్‌లో చోటు చేసుకుంది. టాస్క్‌లో ఓడిపోయానన్న అవమానంతో ఓ కంటెస్టెంట్‌ కత్తితో పొడుచుకోబోయింది. అయితే తోటి హౌస్‌మెట్లు వెంటనే అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా హిందీ బిగ్‌బాస సీజన్‌-15 గత నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ప్రవేశించారు. ప్రస్తుతం హౌస్‌ కెప్టెన్‌గా కొనసాగుతోన్న ఉమర్‌ రియాజ్‌కు బిగ్‌బాస్‌ కొత్త టాస్క్‌ ఇచ్చాడు. కరణ్‌ కుంద్రా, తేజస్వి ప్రకాశ్‌, నిషాంత్‌ భట్‌, అఫ్సానా ఖాన్‌లలో ముగ్గురిని వీఐపీ టికెట్‌ కోసం ఎంచుకోవాలన్నాడు. అయితే ఉమర్‌ అఫ్సానాను తప్పించి మిగతా ముగ్గురిని ఎంచుకున్నాడు. దీంతో కోపోద్రిక్తురాలైన అఫ్సానా… హౌస్‌లో అందరూ తననే టార్గెట్‌చేస్తున్నారని.. నమ్మించి మోసం చేస్తున్నారని వాపోయింది. వెంటనే అక్కడున్న ఓ కత్తితో తనను తాను గాయపరచుకునేందుకు ప్రయత్నించింది. అయితే తోటి హౌస్‌మేట్స్‌ అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అఫ్సానా మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది అఫ్సానా. ముఖ్యంగా శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో నిత్యం గొడవ పడుతూ వార్తల్లో నిలిచింది. ఈ కారణంగానే ఆమె తన ప్రవర్తనా తీరు మార్చుకోవాలని, నిజాయతీగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

Republic: ఓటీటీలో రిపబ్లిక్‌.. డేట్ అనౌన్స్‌ చేసిన మేకర్స్‌.. వీడియో

Hyper Adi: దాడి వార్తలపై వీడియో రిలీజ్‌ చేసిన హైపర్‌ ఆది.. ఏం చెప్పాడంటే..

Hyper Adi: దాడి వార్తలపై వీడియో రిలీజ్‌ చేసిన హైపర్‌ ఆది.. ఏం చెప్పాడంటే..