
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతుంది. కామెనర్స్ వర్సెస్ సెలబ్రెటీస్.. ఆసారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ ముందు నుంచి మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. కానీ ఈ సీజన్ స్టార్ట్ అయి నెల రోజులు పూర్తైనప్పటికీ ఒక్కరూ కూడా టాప్ 5 కంటెస్టెంట్ అని చెప్పడానికి డిసైడ్ కాలేకపోతున్నారు అడియన్స్. మొదటి నుంచి తన స్ట్రాటజీతో, గొవడలతో నిత్యం జనాల నోటిలో నానుతున్న పేరు కేవలం త్రిగుణ్ మాత్రమే. అయితే త్రిగుణ్, రోహిత్ విన్నర్ మెటిరియల్స్ అనుకుంటున్న టైంలో షాలినితో బాండింగ్ రోహిత్ కొంపముంచింది. దెబ్బకు శిఖరాగ్రంలో ఉండాల్సిన రోహిత్ పాతాళానికి పడిపోయాడు. అయినప్పటికీ మనోడు ఏం తగ్గట్లేదు. అయినవాటికి, కానీ వాటికి అరుస్తూ నానా రచ్చ చేస్తూ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ విన్న కౌశల్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. ముఖ్యంగా ఆట మధ్యలోనే విన్నర్ నేనే అంటూ ప్రగల్భాలు పలుకుతున్న కంటెస్టెంట్లపై మాజీ విన్నర్ కౌశల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హౌస్‌లో రోహిత్ ప్రవర్తన , అతని విన్నర్ ప్రిడిక్షన్లపై కౌశల్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అహంకారం తలకెక్కితే పాతాళానికే..
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్‌గా నిలిచిన కౌశల్, ప్రతి సీజన్‌ను చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. తాజాగా సీజన్ 10 పరిణామాలపై ఆయన స్పందిస్తూ రోహిత్‌ను టార్గెట్ చేశారు. ఇంకా ఐదు వారాలు కూడా పూర్తి కాకుండానే, టైటిల్ నాదేనని, ట్రోఫీ నేనే ఎత్తుతానని రోహిత్ అతిగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. కొంచెం అహంకారం ఉండటం సహజమే కానీ, అదే నెత్తినెక్కి శివతాండవం చేస్తే జనం నేరుగా పాతాళానికి తొక్కుతారని కౌశల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరిస్తే బిగ్ బాస్ విన్నర్లు కాలేరని, మంచి ఆట ఆడటం ద్వారానే విజేతలుగా నిలవగలరని అన్నారు.
అరవడం వల్ల ఒరిగేదేమీ లేదు..
ఈ సీజన్లో కంటెస్టెంట్లు విపరీతంగా అరుస్తూ గోల చేస్తున్నారని, ఇది ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లలో కెల్లా అత్యంత లౌడెస్ట్ సీజన్ అని కౌశల్ అన్నారు. అందరి గొడవల్లో వేలు పెడుతూ, కేకలు వేయడమే ట్యాక్టిక్ అనుకుంటున్నారని మండిపడ్డారు. అందరూ అరుస్తున్నప్పుడు కేవలం నరేష్ మాత్రమే ప్రశాంతంగా తమ గేమ్ తాము ఆడుకుంటున్నాడని.. అతడికే కప్పు ఇవ్వాలని అన్నాడు. హౌస్‌లో చాలా సైలెంట్‌గా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్న నరేష్ ఆట తీరును ప్రశంసించారు. మొత్తానికి, రోహిత్ ఆట తీరు మరియు ఆయన ఓటింగ్ గ్రాఫ్ పడిపోతున్న తరుణంలో కౌశల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..