
‘బిగ్‌బాస్ 10 తెలుగు’ డే 41 శనివారం ఎపిసోడ్ పూర్తిగా కంటెస్టెంట్ షాలిని చుట్టూనే తిరిగింది. హౌస్‌లో గత కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తన, అరుపులు, మ్యూఖ్యంగా అసభ్యంగా మాట్లాడుతూ కంటెస్టెంట్స్ మీద మీదకు వెళ్లడం, గేమ్ స్ట్రాటజీ అంటూ అవతలి వ్యక్తులను నిందించడం సహా.. రోహిత్ కాళ్లు మొక్కడం వరకు ప్రతి విషయాన్ని మాట్లాడుతూ షాలినికి గట్టిగానే ఇచ్చిపడేసాడు నాగార్జున. షాలినికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోను ప్లే చేస్తూ దుమ్ముదులిపేశారు. గత వారం నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ, షాలిని వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈసారి నాగ్ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నాటి ఎపిసోడ్లో నాగార్జున షాలినిని ప్రత్యేకంగా కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించి అక్కడ నీతు మాటలు విని రోహిత్ తనకు దూరంగా ఉంటున్నాడని క్లారిటీ ఇచ్చాడు నాగ్. అలాగే నామినేషన్స్ డిస్కషన్ గురించి మాట్లాడలేదు అని చెప్పడంతో అందుకు సంబంధించిన వీడియోలను హౌస్మేట్స్ అందరి ముందు చూపించి తాట తీశారు.
ఎక్కువ మంది చదివినవి : Nartanasala Movie: బృహన్నలగా ఎన్టీఆర్ విశ్వరూపం.. నర్తనశాల వెనుక ఉన్న ఈ అరుదైన నిజాలు తెలుసా.. ?
అమన్, రోహిత్‌లతో కలిసి ఎవరెవర్ని నామినేట్ చేయాలనే విషయంపై సీక్రెట్‌గా చర్చించిన వీడియోను చూపిస్తూ కౌంటరిచ్చారు నాగ్. గత వారం కూడా ఇదే తప్పు చేసినందుకు హెచ్చరించినా మళ్లీ రిపీట్ చేయడంతో, వచ్చే వారం కెప్టెన్సీ పోటీకి అర్హత లేకుండా షాలినితోపాటు అమన్, రోహిత్ ఈ వారం కంటెండర్ షిప్ లేదంటూ చెప్పారు. గేమ్ సాకుతో త్రిగున్‌ను బూతులు తిట్టిన వీడియోను చూపించి, ఆమె చేత త్రిగున్‌కు సారీ చెప్పించారు. నామినేషన్స్ సమయంలో నీతూ కొట్టకపోయినా కొట్టిందని అబద్ధం చెప్పి, ఆమెను ‘మెంటల్’ అని దూషించినందుకు కూడా నాగార్జున ఇచ్చిపడేశాడు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
దీంతో తన తప్పులకు సారీ చెప్పలేక.. తప్పును కవర్ చేసుకోవడానికి ప్రయత్నించి చివరకు ఎమోషనల్ అయ్యింది షాలిని. అయితే తనతో మాట్లాడుతుండగా రోహిత్ మధ్యలో కల్పించుకోవడంతో సీరియస్ అయ్యాడు నాగార్జున. అయితే నాగార్జున మాత్రం “ఇప్పటికైనా నువ్వు మారకపోతే నిన్ను బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరూ కాపాడలేరు” అని తేల్చిచెప్పేశారు. అయితే అంత క్లాస్ తీసుకున్నప్పటికీ బ్రేక్ సమయంలో మరోసారి అమన్ పై అరుస్తూనే ఉంది షాలిని.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..