Prabhas Adipurush: ‘సీత’గా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన దేవసేన

| Edited By: Pardhasaradhi Peri

Sep 29, 2020 | 5:41 PM

రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆదిపురుష్'‌. రామాయణం నేపథ్యంలో 3డీలో తెరకెక్కబోయే ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా

Prabhas Adipurush: సీతగా అనుష్క.. క్లారిటీ ఇచ్చిన దేవసేన
Follow us on

Prabhas Adipurush movie: రెబల్‌స్టార్ ప్రభాస్‌తో ఓమ్‌ రౌత్ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’‌. రామాయణం నేపథ్యంలో 3డీలో తెరకెక్కబోయే ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా ఖరారయ్యారు. ఇక సీత పాత్రకు గానూ పలువురి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కీర్తి సురేష్, కియారా, ఊర్వశి రౌటేల్‌తో పాటు అనుష్క పేరు కూడా నెట్టింట హల్‌చల్‌ చేసింది. అంతేకాదు అనుష్క ఫైనల్ అయ్యిందని కూడా టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై అనుష్క క్లారిటీ ఇచ్చారు.

ఆదిపురుష్‌లో సీతను తాను కాదని అనుష్క వెల్లడించారు. అలాంటి ప్రపోజల్ ఏది తన దగ్గరకు వెళ్లలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అనుష్క నటించిన హారర్ థ్రిల్లర్‌ నిశ్శబ్దం వచ్చే నెల 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రభాస్‌, అనుష్కలది హిట్ పెయిర్. వీరిద్దరు కలిసి నాలుగు చిత్రాల్లో(బాహుబలి రెండు భాగాలు) నటించగా.. అవన్నీ మంచి విజయాలను సాధించాయి. అంతేకాదు ఈ జంటకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ పక్కన సీతగా అనుష్క సెట్ అవుతుందని భావించిన ఆదిపురుష్ టీమ్‌.. ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read More:

రాక్‌స్టార్ తమ్ముడి కొత్త రూట్‌.. పూరీతో పనిచేస్తున్న సాగర్‌

Breaking: ఏపీలో ‘డ్రీమ్‌ 11’ బ్యాన్‌.. డబ్బులపై స్పందించిన యాప్‌