
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన ట్యూన్స్‌తో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. తన మ్యూజిక్ ద్వారా శ్రోతలను ఊర్రూతలూగించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశారు. నవంబర్ 11న హైదరాబాద్ సన్ రైజర్స్ సహ యజమాని కావ్య మారన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న వీరిద్దరి వివాహ రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా జరగనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అనిరుధ్ లైఫ్ స్టైల్, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ ప్రముఖ డిజైన్ మ్యాగజైన్ కోసం ఆయన తన చెన్నై నివాసాన్ని ఇంటీరియర్ టూర్ ద్వారా పరిచయం చేశారు. ఈ సందర్భంగా అనిరుధ్ తన ఇంటికి సంబంధించిన విశేషాలను పంచుకోగా, అందులో ఆయన బెడ్రూమ్కు సంబంధించి చెప్పిన ఒక వింత విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..
సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లు అంటే ఖరీదైన ఫర్నిచర్, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయని భావిస్తుంటాం. కానీ అనిరుధ్ రవిచందర్ బెడ్రూమ్లో ఎలాంటి పెద్ద మంచం (Bed) లేకపోవడం విశేషం. దీనికి బదులుగా ఆయన తన గదిలో నేలపై నేరుగా మ్యాట్రెస్ వేసుకుని నిద్రపోవడాన్ని ఇష్టపడతానని తెలిపారు. నేలపై పడుకోవడం ఎందుకో ఎంతో సౌకర్యంగా ఉంటుందని, అలాగే అది ఆరోగ్యానికి మంచిదని.. తనకు ఎక్కువ బట్టలు లేదా సామాగ్రిని పోగేసుకోవడం ఇష్టం ఉండదని ఆయన సరదాగా పేర్కొన్నారు. ఇక చెన్నైలోని ఈ నివాసంలో అనిరుధ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఎంత బిజీ లైఫ్ గడిపినా, ఇంటికి రాగానే సాధారణ జీవితాన్ని గడపడానికే ఆయన ఇష్టపడతారు. ఈ ఇంట్లో కుటుంబ జ్ఞాపకాలను భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన ‘మెమరీ వాల్’ ఉండటం మరో విశేషం. తన చిన్ననాటి ఫోటోలు, కుటుంబ సభ్యులతో దిగిన అరుదైన చిత్రాలను ఈ గోడపై అమర్చుకున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు రాకముందు నుంచి ఇప్పటివరకు తన ప్రయాణంలో ఎదురైన మధుర జ్ఞాపకాలను ఈ ఇల్లు ఎప్పుడూ గుర్తుచేస్తుందని ఆయన చెప్పారు.
ఈ నివాసంలో కేవలం కుటుంబంతో గడపడానికే కాకుండా, సినిమా కథలు వినడానికి, మ్యూజిక్ కంపోజ్ చేయడానికి అనువైన ప్రత్యేక స్టూడియో స్పేస్ కూడా ఉంది. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలు చూసేందుకు వీలుగా అత్యాధునిక హోమ్ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి ఆవరణలో పెద్ద మామిడి చెట్టు ఉండటం, పచ్చని వాతావరణం ఈ ఇంటికి మరింత ప్రశాంతతను చేకూరుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంతటి స్టార్డమ్ అనుభవిస్తున్నప్పటికీ, తన మూలాలను మరిచిపోకుండా సాధారణ జీవితాన్ని గడపడమే తన విజయ రహస్యమని అనిరుధ్ నిరూపిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..