Dasara: దసరా మూవీకి వ్యతిరేకంగా అంగన్వాడీల నిరసన.. అసలు కారణం ఏంటంటే..

|

Apr 01, 2023 | 6:51 PM

ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్‌ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్ని వివాదాలు అంతే పాపులర్‌ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూశే ఉంటాం. తాజాగా ఈ నిరసనల సెగ దసరా చిత్రాన్ని కూడా తాకాయి...

Dasara: దసరా మూవీకి వ్యతిరేకంగా అంగన్వాడీల నిరసన.. అసలు కారణం ఏంటంటే..
Dasara Movie
Follow us on

ఇటీవలి కాలంలో సినిమాలు ఎంత పాపులర్‌ అవుతున్నాయో సినిమాల చుట్టూ నెలకొన్ని వివాదాలు అంతే పాపులర్‌ అవుతున్నాయి. సినిమాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు తమను కించపరిచేలా ఉన్నాయంటూ నిరసనలు తెలపడం మనం చూశే ఉంటాం. తాజాగా ఈ నిరసనల సెగ దసరా చిత్రాన్ని కూడా తాకాయి. నాని, కీర్తి సురేష్‌ జంటగా తెరకెక్కిన దసరా మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోందీ సినిమా. సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు దసరా మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా దసరా మూవీకి నిరసన సెగ తగిలింది. ఆదిలాబాద్‌కు చెందిన కొందరు అంగన్వాడీ కార్యకర్తలు దసరా మూవీ ప్రదర్శిస్తోన్న థియేటర్ల ముందు నిరసన తెలిపారు. దసరా సినిమాపై అంగన్వాడీ వర్కర్లు ఎందుకు నిరసన తెలిపారని ఆలోచిస్తున్నారా.? సినిమాలో అంగన్వాడీ వర్కర్‌ కోడిగుడ్లు అమ్ముకుంటున్నట్లు పెట్టిన సన్నివేశంపై అభ్యంతరం తెలిపారు. సదరు సన్నివేశాన్ని తొలగించి, దర్శకుడు అంగన్వాడీ వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సన్నివేశాన్ని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని, చాలీచాలని వేతనలతో నిస్వార్థంగా సేలందిస్తున్న తమను అవమానపర్చడం సిగ్గు చేటని వాపోయారు. మరి ఈ చిత్ర దర్శకుడు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే దసరా మూవీ కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లో ఏకంగా విడుదలైన రెండు రోజుల్లో ఏకంగా రూ. 53 కోట్లు గ్రాస్ వ‌సూళ్లను సాధించింది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..