పాటతో ప్రారంభం కానున్న ‘పుష్ప’

| Edited By:

Sep 08, 2020 | 8:34 AM

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. త్వరలో ఈ మూవీ సెట్ మీదకు వెళ్లనుంది

పాటతో ప్రారంభం కానున్న పుష్ప
Follow us on

Pushpa Movie Shooting: అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం పుష్ప. త్వరలో ఈ మూవీ సెట్ మీదకు వెళ్లనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం పాటతో ఈ సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఇప్పటికే ట్యూన్స్‌ని రెడీ చేయగా.. అందులోని ఓ డ్యూయెట్‌తో సుకుమార్ చిత్రీకరణను ప్రారంభించనున్నారట. ఈ పాటలో బన్నీ, రష్మిక కలిసి స్టెప్పులు వేయబోతున్నారట. ఇప్పటికే షూటింగ్‌ కోసం రష్మిక హైదరాబాద్ వచ్చేయడం, మరోవైపు బన్నీ కూడా రెడీగా ఉండటంతో త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ పాత్రలో లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. రష్మిక పల్లెటూరి యువతిగా కనిపించనుంది. మొదటిసారిగా వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Read More:

Breaking: నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ఐసీఐసీఐ బ్యాంక్‌ స్కాం‌: చందాకొచ్చర్ భర్త అరెస్ట్‌