Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..

మనం సంపాదించిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగా పొదుపు చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకోవాలని నటుడు మురళీ మోహన్ గారు సూచించారు. సంపాదించిన దానిలో 10-20% తప్పనిసరిగా పక్కన పెట్టాలని, అప్పుల పాలు కాకుండా, ఆర్థికంగా ఎదగడానికి ఇది ప్రాథమిక సూత్రమని ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు చిట్కా అనేక జీవితాలను మార్చగలదని పేర్కొన్నారు.

Murali Mohan: ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే చాలు జీవితం మారిపోతుంది.. డబ్బు సంపాదనకు మురళీ మోహన్ ఇచ్చిన సలహాలు..
Murali Mohan

Updated on: Oct 13, 2026 | 4:36 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత నటుడిగా అలరించారు మురళీమోహన్. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆయన.. ఆ తర్వాత నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. అటు ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయాలను ఎప్పుడూ పలు ఇంటర్వ్యూలలో పంచుకునే ఆయన.. ఇటీవల తన సంపాదన, మనీ సేవింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు ప్రాముఖ్యతను చెబుతూ, జీవితాలను మార్చే సలహాను అందించారు. మురళీ మోహన్ ప్రకారం.. ఆదాయం ఎంత ఉన్నా, ముందుగా కొంత భాగాన్ని పొదుపు చేయడం అత్యంత ముఖ్యమని అన్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వంద రూపాయలు సంపాదిస్తే, పది నుంచి ఇరవై శాతం, అంటే పది నుంచి ఇరవై రూపాయలను వెంటనే పక్కన పెట్టాలని తెలిపారు. మిగిలిన ఎనభై లేదా తొంభై రూపాయలతోనే ఖర్చులను సర్దుబాటు చేసుకోవాలి. ఈ విధానం వ్యక్తిగత ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని, భవిష్యత్ భద్రతకు పునాది వేస్తుందని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి: Tollywood : అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. అతడు ప్రపంచంలోనే నెంబర్ వన్ యాక్టర్.. టాలీవుడ్ విలన్..

వంద రూపాయలు సంపాదించి, వంద ఖర్చు చేస్తే, అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుందని మురళీ మోహన్ గారు హెచ్చరించారు. “నేను ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఈ ఇరవై శాతం పక్కన వెయ్యాల్సిందే” అనే కఠినమైన నిర్ణయంతోనే ఆర్థికంగా పైకి రాగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ పొదుపు అలవాటు వ్యర్థ ఖర్చులను తగ్గిస్తుంది, భవిష్యత్తు కోసం నిధులను సమకూర్చుతుంది. ఇది కేవలం డబ్బును దాచుకోవడం కాదు, ఆర్థిక స్వాతంత్ర్యం వైపు వేసే మొదటి అడుగు. ఈ జీవనశైలి మార్పు ద్వారా ఎవరైనా సులభంగా ఆర్థికంగా స్థిరపడగలరని ఆయన చెప్పారు.

ఎక్కువమంది చదివినవి: Cinema : ఓటీటీలో వణుకుపుట్టిస్తోన్న తెలుగు సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్.. ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీని చూశారా.. ?

మురళీ మోహన్ మొదట విజయవాడలో వ్యాపారం చేస్తూనే, నాటకాలపై ఉన్న ఆసక్తితో నాటక రంగంలోకి ప్రవేశించారు. 1973లో ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ‘జగమే మాయ’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. 1974లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘తిరుపతి’ చిత్రం ఆయన కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది. దాసరి నారాయణరావు ఆయన ప్రతిభను గుర్తించి ఏకంగా 40కి పైగా సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. 1975 నుండి 1985 మధ్యకాలం ఆయన సినీ ప్రస్థానంలో అత్యంత విజయవంతమైన కాలంగా నిలిచింది. ఈ సమయంలో ఆయన హీరోగా, ద్వితీయ కథానాయకుడిగా దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించారు.

ఎక్కువమంది చదివినవి: Cinema: సినిమాగా తీసిన పాపులర్ నాటకం.. థియేటర్లను షేక్ చేసిన దాసరి మూవీ.. 225 రోజులు ఆడి రికార్డు..

ఎక్కువమంది చదివినవి: Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

Loading...
Unable to load recommendations.
Follow Us